శ్రీశైలం రత్నగర్భ గణపతి స్వామి వారిని దర్శించుకున్న భారత రాష్ట్రపతి

శ్రీశైలం ప్రధాన ఆలయంలోకి ప్రవేశించిన అనంతరం ముందుగా రత్న గర్భ గణపతి స్వామి వారిని దర్శించుకున్న భారత రాష్ట్రపతి, తెలంగాణ గవర్నర్లు.శ్రీ మల్లికార్జున స్వామి వారిని దర్శించి రుద్రాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

 President Of India Who Visited Srisailam Ratnagarbha Ganapathi Swami ,srisailam-TeluguStop.com

తదుపరి మల్లికా గుండంలో ప్రతిబింబించే ఆలయ విమాన గోపురాన్ని దర్శించుకున్నారు.అనంతరం శ్రీ భ్రమరాంబ దేవి అమ్మవార్లకు కుమార్చన జరిపించుకున్నారు.

అనంతరం భారత రాష్ట్రపతి, తెలంగాణ గవర్నర్లను అర్చక స్వాములు, వేద పండితులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలను, శేష వస్త్రాలను, శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి చిత్రపటాల జ్ఞాపికను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, స్థానిక ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, దేవదాయశాఖ కమిషనర్ డాక్టర్ హరి జవహర్ లాల్, ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డి వారి చక్రపాణి రెడ్డి, దేవస్థానం ఈఓ లవన్నలు అందచేశారు.నందినికేతన్ అతిధి గృహంలో విడిది చేస్తున్న రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ..

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube