ఒక సినిమా విడుదల చేయాలి అంటే ఈ మధ్యకాలంలో కాంట్రవర్సీ ఉంటే మాత్రమే ప్రమోషన్ గట్టిగా జరుగుతుంది అని నమ్ముతున్నారు.సినిమా ప్రమోషన్ కోసం వింత వింత వేషాలు వేస్తూ ఏదో రకంగా జనాల అట్రాక్షన్ ని పొందుతున్నారు.
అయితే గతంలో అలా ఉండేది కాదు.సినిమా విషయంలో ఏదైనా బెదిరింపులు వస్తే ఆ నిర్మాత గడగడా వణికి పోయేవారు.
ఎక్కడ సినిమా ఆగిపోతుందో అనే భయం వారిలో ఎక్కువగా ఉండేది.
ఎందుకంటే ఇప్పట్లో డబ్బుకు పెద్దగా విలువలేదు.
పైగా సినిమా తీస్తే థియేటర్లో రాకపోతే ఓటిటి కి అమ్మేస్తాం.మరీ కాకపోతే యూట్యూబ్ లో అయినా వేసుకుంటాం అనే రీతిలో కొంతమంది నిర్మాతలు ఉన్నారు.
అప్పట్లో సోషల్ మీడియా ఇంత హడావిడి లేదు కాబట్టి ఎవరైనా సరే థియేటర్ కి వచ్చి చూడాలి.ఇక నిర్మాతను అంతగా వణికించిన ఒక సందర్భం గురించి ప్రస్తుతం తెలుసుకుందాం.
తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ మొదటి సినిమాగా యాక్షన్ కింగ్ అర్జున్ పెట్టి జెంటిల్మెన్ తీసి భారీ హిట్టు కొట్టాడు.

కానీ రెండవ సినిమా విషయానికి వచ్చేసరికి ప్రభుదేవా నీ హీరోగా తీసుకొని కాదలన్ అనే పేరుతో సినిమా తీశాడు.ఈ చిత్రంలో నగ్మా హీరోయిన్ గా నటించగా, ఈ సినిమా తెలుగులో ప్రేమికుడు పేరుతో విడుదలై ఘన విజయం సాధించింది.అయితే ఈ సినిమా గవర్నర్ కూతుర్ని ఒక మామూలు వ్యక్తి ప్రేమించి ఎలా ఆ ప్రేమను గెలిపించుకున్నాడు అని సబ్జెక్టుతో ఉంటుంది.
ఇక గవర్నర్ పాత్ర గిరీష్ కర్నాడ్ పోషించాడు.ఆ సమయంలో తమిళనాడు రాష్ట్రానికి జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నారు.శంకర్ తీస్తున్న సినిమాలో గవర్నర్ పాత్ర ఉండి కుట్రలు, కుతంత్రాలు చేసి ఆ ప్రేమను ఎలా ఆపడానికి ప్రయత్నిస్తాడు

అని విషయం ఉందని అక్కడ లోకల్ గవర్నర్ ఆఫీస్ నుంచి ఆ సినిమా నిర్మాత కుంజుమన్ కి వార్నింగ్ కాల్స్ వచ్చాయి.గవర్నర్ అనే పాయింట్ ని తీసేసి, ఆ సన్నివేశాలు అన్నీ కూడా కట్ చేయమని బెదిరించారు.దాంతో నిర్మాత జయలలితకి విషయం చెప్పడంతో ఆమె అభయహస్తం ఇచ్చారు.నీ సినిమాలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే సెన్సార్ వారు కట్ చేస్తారు అంతేకానీ మీరు ఎవరికీ భయపడవద్దు మీ సినిమా మీరు తీయండి అని చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు సినిమా విడుదలైన తర్వాత జయలలిత స్వయంగా సినిమా బాగుంది అంటూ చెప్పడం కోసమెరుపు.







