సినిమాలు, బుల్లితెర సీరియళ్ల ద్వారా పాపులారిటీని సంపాదించుకున్న నటీమణులలో ప్రీతి నిగమ్( Preeti Nigam ) ఒకరనే సంగతి తెలిసిందే.తాజాగా ఈ నటి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు.
ఈతరం పిల్లల్లో సహనం లోపించిందని ఉమ్మడి కుటుంబాలు తక్కువ కావడం వల్లే విడాకులు ఎక్కువయ్యాయని ఆమె తెలిపారు.ఏ పని చేసినా ఆలోచించి చేయాలని ఇదే నేను ఇచ్చే సలహా అని ప్రీతి నిగమ్ చెప్పుకొచ్చారు.
చిన్నప్పుడే కూచిపూడి, కథక్, ఫోక్ డ్యాన్స్( Kuchipudi, Kathak, Folk Dance ) నేర్చుకున్నానని ఆమె అన్నారు.మాది చిత్రగుప్తుల వంశమని ఆమె కామెంట్లు చేశారు.ఇండస్ట్రీలోకి వచ్చి 33 సంవత్సరాలు అయిందని ఋతురాగాలు( ruthuragalu ) సీరియల్ నా జీవితాన్ని మార్చిందని ఆమె చెప్పుకొచ్చారు.మా అత్తింటి వాళ్లు నన్ను కూతురిలా చూసుకుంటారని ప్రీతి నిగమ్ అన్నారు.
ఈటీవీ సీరియల్స్ వల్ల నాకు మంచి పేరు వచ్చిందని ఆమె కామెంట్లు చేశారు.
సీరియళ్లలో ఎక్కువగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు పోషించడంతో రైలులో ప్రయాణిస్తున్న సమయంలో ఒకావిడ మీరు మా వైజాగ్ రాకండి మా వాళ్లంతా కొడతారు అని చెప్పిందని ప్రీతి నిగమ్ కామెంట్లు చేశారు.తెలుగులో స్టూడెంట్ నంబర్ 1 నా తొలి సినిమా అని ఆమె పేర్కొన్నారు.నన్ను బుల్లితెర జయసుధ అని పిలుస్తారని అలా పిలవడం సంతోషాన్ని కలిగిస్తుందని ప్రీతి నిగమ్ చెప్పుకొచ్చారు.
అమ్మ పాత్రలలో నటించడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రీతి నిగమ్ కామెంట్లు చేశారు.మా అబ్బాయి పేరు ఆర్యన్( Aryan ) అని నా కొడుకు హాకీ టీంకు తొలి కెప్టెన్ గా ఎంపికయ్యాడని ప్రీతి నిగమ్ చెప్పుకొచ్చారు.డ్యాన్స్ ప్రాధాన్యత ఉన్న సినిమాలలో నటించాలని నా కోరిక అని ఆమె తెలిపారు.సహనంతో ఉండాలని వృత్తిని గౌరవించాలని ఎవరికైనా చెబుతానని ప్రీతి నిగమ్ వెల్లడించారు.ఆమె చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.