భారతదేశంలో ఉత్తరప్రదేశ్ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలలో మామిడి సాగు ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయబడుతుంది.అయితే మామిడి తోటలను సాగు చేసే రైతులు కొన్ని పద్ధతులపై అవగాహన కల్పించుకుని పాటిస్తేనే అధిక దిగుబడి సాధించడానికి వీలు ఉంటుంది.
ముఖ్యంగా పంట పూత దశలో ఉన్నప్పుడు తీసుకునే జాగ్రత్తల పైన వచ్చే దిగుబడి ఆధారపడి ఉంటుంది.అవి ఏమిటో చూద్దాం.

తెలుగు రాష్ట్రాలలో మామిడి తోటలను సాగు చేసే రైతులు జనవరి నుంచి యాజమాన్య పద్ధతులను చేపట్టాలి.డిసెంబర్ లో పూత రానట్లయితే జనవరి మొదటి వారంలో 10 గ్రాముల పొటాషియం నైట్రేట్ ను 5 గ్రాముల యూరియా ను, ఒక లీటరు నీటిలో కలిపి మొక్కలపై పిచికారి చేయాలి.ఈ పిచికారి చేయడం వల్ల త్వరగా పూమొగ్గలు వస్తాయి.మామిడికాయ బఠానీ సైజులో ఉన్నప్పుడు రెండు శాతం యూరియా పిచికారి చేయడం వల్ల కాయ ఎదుగుదల బాగా ఉంటుంది.
పొటాషియం నైట్రేట్ మరియు యూరియా కలపడం వల్ల మామిడి ఆకులు మందును త్వరగా పీల్చుకుంటాయి.ఈ పొటాషియం నైట్రేట్ ను ఆకులపై పిచికారి చేస్తే ఆకులు వాటిని త్వరగా ఆహార పదార్థాలుగా మార్చుకొని పూమొగ్గలకు తొందరగా చేరవేసి పూత రావడానికి తోడ్పడుతుంది.

మామిడి మొక్కలకు పూత వచ్చిన తర్వాత పూత విచ్చుకోక ముందే ఫ్లోనో ఫిక్స్ మూడు మిల్లీలీటర్లు ను ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారి చేస్తే పూత అనేది ఎక్కువ శాతం పిందె కట్టడానికి ఉపయోగపడుతుంది.ఫిబ్రవరి మొదటి వారంలో పిందెలు గోలికాయ సైజులో ఉన్నప్పుడు 10 సంవత్సరాల వయసు ఉండే తోటలలో సుమారుగా 110గ్రా యూరియా, 750గ్రా మ్యూరెట్ ఆఫ్ పొటాష్ అవును చెట్టుకు అందిస్తే పిందె రాలడం తగ్గి పిందే ఎదుగుదల బాగా ఉంటుంది.ఎరువులు వేసిన తర్వాత పంటకు నీటి తడులు అందించాలి.డ్రిప్ విధానం ద్వారా మనకు నీటిని అందిస్తే.నీటిలో కరిగే ఎరువులను ఫెర్టిగేషన్ పద్ధతుల్లో అందించాలి.మామిడి తోటలలో పిందె, బఠాణి నుండి గోలీ కాయ సైజులో ఉన్నప్పటినుండి కాయ ఎదిగే వరకు కనీసం క్రమం తప్పకుండా నాలుగు నీటి తడులు అందించాలి.
కాయ కూతకు వచ్చే 10 రోజుల ముందు నీటి తడులు ఆపేయాలి.







