స్థాయిని మరచి చంద్రబాబు గారిపై విమర్శలు చేస్తున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని గారి వైఖరి పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ,మాట్లాడిన మాజీ మంత్రివర్యులు,తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రత్తిపాటి పుల్లారావు గారు నాడు మహానాడులో చంద్రబాబు గారితో వేదిక పంచుకొని చంద్రబాబు గారి దయతోనే ఇంత ఎత్తుకు ఎదిగానని చంద్రబాబు నాటిన చెట్టు కొమ్మనని గొప్పగా చెప్పుకొని నేడు జగన్ రెడ్డి వంచన చేరి తన మంత్రి పదవిని కాపాడుకోవడానికి చంద్రబాబు గారిపై స్థాయిని మరిచి విమర్సలు చేస్తున్న మంత్రి విడదల రజిని గారు ఏ ఎండకా గొడుగు పట్టడంలో సిద్ధహస్తురాలు ఈ విషయం రాష్ట్ర ప్రజలకు కూడా అర్థమైంది! ఈరోజు నువ్వు ఈ స్థాయిలో ఉన్నావంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారి దయే లోకేష్ గారు మంగళగిరిలో ఓడిపోయారంటూ ఆయన మీద విమర్శలు చేయడం మంచి పద్ధతి కాదు.రాజకీయాల్లో గెలుపు ఓటములు అనేవి సహజం .
జగన్మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మ గారిని విశాఖపట్నంలో గెలిపించుకోలేక పోయారు.ఆ విషయం మంత్రిగారికి గుర్తుండకపోవచ్చు.
మీ శాఖలో జరుగుతున్న అవినీతిపైన గుంటూరు GGH లో వైద్యం కోసం వస్తున్న నిరుపేదలపై అక్కడి అధికారులు వ్యవహరిస్తున్న నిర్లక్ష్య వైఖరి వీటన్నిటి పైనా దృష్టి పెట్టండి.
దేశానికి సేవలందించిన ఒక సైనిక ఉద్యోగి వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళితే అక్కడ 24 గంటలు గడిచినా వైద్యం అందించలేకపోయారు.
ఇది మీ శాఖలో జరుగుతున్న దౌర్భాగ్య పరిస్థితి.పైగా ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన మాజీ సైనిక ఉద్యోగి పైన మీ పార్టీకి చెందిన వారే హత్యాయత్నం చేశారు.
హత్యాయత్నం చేసిన వారిపైన సరైన సెక్షన్ల కింద కేసులు పెట్టకపోగా వారిని ఇప్పటికీ బెదిరిస్తున్నారు.మాజీ సైనిక ఉద్యోగి బాజీ చేసిన పాపం కూడా ఏమీ లేదు.
వార్డులో సమస్యలపై ప్రశ్నించాడని కక్ష కట్టి మరీ అతనిపై హత్యాయత్నానికి పాల్పడ్డారు.మీ శాఖలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను గాలికి వదిలేసి వాటిపై దృష్టి పెట్టకపోగా చంద్రబాబు పైన నారా లోకేష్ గారి పైన విమర్శలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి భజన చేసుకుంటూ పాలన కొనసాగిస్తున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీ గారు.
రాష్ట్రంలో ప్రశ్నిస్తే సిఐడి వారు గోడలు దూకిమరీ వచ్చి బాధితులను అరెస్టు చేసి పట్టుకెళ్తారు.చిలకలూరిపేట నియోజకవర్గంలో ప్రశ్నిస్తే వారిపై మంత్రి అనుచరులు దాడులు చేసి హత్యాయత్నం చేస్తారు.
బాధితులపై సరైన సెక్షన్ల కింద కేసులు పెట్టకుండా పోలీసు వారిపై ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు.మూడున్నర సంవత్సరాల కాలంలోనే వైసీపీ పాలన ప్రజలు భరించలేని స్థితికి వచ్చారు.
ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు.భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతు సోదరులకు పంట నష్టపరిహార అంచనాలు ఇప్పటివరకు తయారు చేయలేదు.
ప్రతి ఎకరాకు ఐదు నుంచి ఆరు క్వింటాలు ప్రతి పంట నష్టపోయారు.అలానే మిర్చి వేసిన రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారు.
పోయిన సంవత్సరం జరిగిన పంట నష్టపరిహారం రైతు సోదరులకు ఇప్పటివరకు అందలేదు.కొద్ది రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు పంట నష్టపోయిన రైతు సోదరులను పరామర్శించడానికి వస్తున్నారని తెలిసి హడావుడిగా పర్యటన చేసిన మంత్రి విడదల రజని గారు, రైతులకు ఎలాంటి నష్టపరిహారం అందించారో? చెప్పాల్సిన బాధ్యత విడదల రజని ఫై లేదా అని ప్రశ్నించారు.ఒక మంత్రిగా మీకు రైతుల పట్ల బాధ్యత ఉంటే వారికి ఎలాంటి భరోసానివ్వబోతున్నారు చెప్పాలి.
చిలకలూరిపేట నియోజకవర్గంలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న 340 మంది రైతులకు ఇప్పటివరకు ఒక్క కనెక్షన్ కూడా ఇవ్వలేదు.
రైతులకు జరిగిన పంట నష్టపరిహారం ఇవ్వరు.విద్యుత్ కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకుంటే కొత్త విద్యుత్ కనెక్షన్లు కూడా ఇవ్వరు.రైతుల పట్ల ఈ ప్రభుత్వానికి ఎంత నిర్లక్ష్య వైఖరి వ్యవహరిస్తుందో ఈ సంఘటనే చెప్తుంది.అలానే ఇప్పటికే విద్యుత్ కనెక్షన్లు ఉన్న రైతులకు కరెంటు మీటర్లు బిగిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం విద్యుత్ మీటర్లు బిగించడంలో వెనకడుగు వేసినా రాష్ట్ర ప్రభుత్వ మాత్రం వెనక్కి తగ్గడం లేదు.విద్యుత్ మీటర్ల బిగింపులో జగన్ రెడ్డి ప్రభుత్వం వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతుంది.
కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన అలవిగాని హామీలతో ఒక్కసారి చూద్దామని ప్రజలు ఓటు వేసి మోసపోయారు.కాబట్టి ఇకనుండి అయినా ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు, ప్రతిపక్ష నాయకుడిపై రాళ్లదాడులు చేయడం లాంటి దురాలోచనలు మానుకోవాలని హెచ్చరించారు.