ప్రస్థానం సినిమా.( Prasthanam Movie ) ఈ సినిమా ఇప్పుడు కొత్తగా వచ్చే వారికి గుర్తుండే అవకాశం లేదు కానీ ఒక పదమూడు ఏళ్ళు వెనక్కి వెళితే శర్వానంద్( Sharwanand ) హీరో గా దేవా కట్ట దర్శకత్వంలో వచ్చింది.
ఇది ఎంత మంచి హిట్ అంటే ఆ దశాబ్దానికి ఉత్తమ 25 చిత్రాల్లో ప్రస్థానం కి స్థానం దక్కేంత మంచి సినిమాగా నిలిచింది.ఈ చిత్రంలో శర్వానంద్ నటన అద్భుతంగా ఉంటుంది.
అలాగే సాయి కుమార్ డైలాగ్స్ తో ఈ చిత్రానికి విజయాన్ని అందించాడు అంటే అది అతిశయోక్తి కాదు.దర్శకుడు ఈ సినిమాలో శర్వానంద్ లాంటి ఒక చిన్న నటుడిని పెట్టినప్పుడే ఎలాంటి అంచనాలు లేకుండా చిత్రాన్ని చూడాలని అనుకోని ఉండచ్చు.

కానీ ఈ సినిమా అల్లు అర్జున్( Allu Arjun ) లాంటి ఒక స్టార్ హీరో లేదా జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) లాంటి ఒక ఇంటెన్స్ హీరో చేస్తే ఖచ్చితంగా పెద్ద హిట్ కాదు ఇండస్ట్రీ హిట్ అయ్యేది అని చాల మంది అంటూ ఉంటారు.ఎవరు ఔనన్నా కాదన్నా దేవా కట్ట మంచి దర్శకుడు అయన బాహుబలికి స్క్రీన్ ప్లే విషయంలో రాజమౌళికి చాల సహాయం చేశారట.ఇక చాల మంచి సినిమాలు చిన్న హీరోల వల్ల మాములు హిట్స్ గా మిగిలిపోయిన అనేక సందర్భాలు ఉన్నాయ్.అందులో ప్రస్థానం కూడా ఉంటుంది.అయితే ఈ సినిమాలో ఎలాంటి కమర్షియల్ అంశాలు లేకపోవడం వల్ల పెద్ద హీరోలు ఎవరు ఈ చిత్రంలో నటించడానికి ముందుకు రారు అనే ఒక అభిప్రాయం కూడా ఉంది.

ఇమేజ్ అనే చట్రం లో ఇరుక్కున్న చాల మంది పెద్ద హీరోలు తల్లిని మరొకరికి ఇచ్చి పెళ్లి చేస్తే వారి అభిమానులు హర్ట్ అవుతారని కూడా అనుకుంటారు.ఇక సాయి కుమార్ పాత్రలో మమ్మూట్టి ని అడిగితే అయన ప్రస్థానం సినిమాలో నటించడానికి ఒప్పుకోలేదట.అందుకే అయన స్థానంలో సాయి కుమార్ ని ఎంచుకున్నారు దర్శకుడు.
ఈ సినిమా విజయం లో సాయి కుమార్ మరియు శర్వానంద్ ముఖ్య పాత్ర పోషించగా, ఈ సినిమాకు సీక్వెల్ తీస్తే బాగుండు అని సోషల్ మీడియాలో చాల రోజులుగా వినిపిస్తున్న మాట.అయితే ఈ సినిమా ద్వారా శర్వానంద్ తనలోని నటుడికి సాన పెట్టాడు.







