నేటితో మారనున్న తిరుమల శ్రీవారికి సమర్పించే నైవేద్యం.. !

కలియుగ వైకుంఠంగా పిలవబడే తిరుమల వెంకటేశ్వరుని దర్శనం కోసం దేశం నలుమూలల నుండి ఎందరో భక్తులు వస్తారన్న విషయం తెలిసిందే.

ప్రశాంతమైన వాతావరణంలో సాక్షాత్తూగా స్వర్గానికే వెళ్లుతున్నామనే భావన కలిగేలా ఉన్న ఏడుకొండల ప్రయాణం భక్తుల మదిలో చిరకాలం నిలిచిపోతుందన్నది నిజం.

ఇంతటి మహాన్వితం అయిన స్వామి వారి దర్శనం కోసం పడిగాపులు కాయడంలో ఉన్న ఆనందం మాటల్లో వర్ణించలేనిది.ఇకపోతే ప్రస్తుతం స్వామి వారికి నిత్యం మూడు పూటలా 195 కిలోల ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పిస్తున్న సంగతి తెలిసిందే.

కానీ నేటి నుండి తిరుమల శ్రీవారికి సమర్పించే నైవేద్యం మారనుందట.కృష్ణా జిల్లా గూడూరు మండలం పినగూడూరులోని సౌభాగ్య గోశాల, సేవ్ సంస్థ నిర్వాహకుడు, ప్రకృతి వ్యవసాయవేత్త ఎం.విజయరామ్ ఈ కార్యక్రమానికి రూపకల్పన చేయగా, నేడు ఆలయ అధికారులు, ప్రధాన అర్చకుల సమక్షంలో ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది.ఈమేరకు ఈరోజు నుండి దేశీయ విత్తనాలతో ప్రకృతి సిద్దంగా సాగు చేసిన బియ్యంతో వండిన నైవేద్యాన్ని, రోజుకో రకంతో ఏడాదంతా 365 రకాల బియ్యంతో చేసి స్వామివారికి నివేదించనున్నారు.

తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు