మామిడి కాయలు అమ్ముకుంటున్న స్టార్ యాక్టర్ కొడుకు

సౌత్ ఇండియాలో విలక్షణ నటుడిగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్న యాక్టర్ ప్రకాష్ రాజ్, అటు బాలీవుడ్‌లోనూ తనదైన మార్క్‌ను వేసుకున్నాడు.

ఇక ఈ యాక్టర్ నటించిన సినిమాలతో అనేక మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు.

కాగా ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రకాష్ రాజ్ తన కుటుంబ సభ్యులకు సంబంధించిన ఫోటోలను అప్పుడప్పుడు పెడుతుంటాడు.కాగా ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా తన కుటుంబ సభ్యులతో కలిసి ఫాం హౌజ్‌లో ఉంటున్నాడు.

ప్రకృతిని ప్రేమించే వ్యక్తిగా ప్రకాష్ రాజ్ ఎప్పుడు సమయం దొరికినా ఫాం హౌజ్‌లో గడుపుతాడట.కాగా తాజాగా తన ఫాం హౌజ్‌లోని మామిడి తోటలో పండిన మామిడి కాయల మధ్య తన కొడుకు కూర్చున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

మావాడు మామిడి కాయల వ్యాపారి అయ్యాడు అంటూ మురిసిపోతున్నాడు.కాగా ప్రకాష్ రాజ్ పెట్టిన ఫోటోకు నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.

Advertisement

ప్రకాష్ రాజు కొడుకు ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

డబుల్ ఇస్మార్ట్ హిట్ అయితే పూరి కి ఆ స్టార్ హీరో డేట్స్ ఇస్తాడా..?
Advertisement

తాజా వార్తలు