మంచు విష్ణు ఆ మాటిస్తే నా రాజీనామా ని వెనక్కి తీసుకుంటా...!

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఇటీవలే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి ఎన్నికలు ముగిసిన సంగతి అందరికి తెలిసిందే.అయితే ఈ ఎన్నికలలో భాగంగా టాలీవుడ్ ప్రముఖ హీరో మంచు విష్ణు మరియు ప్రముఖ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మా అసోసియేషన్ అధ్యక్ష పదవికి పోటీ చేశారు.

 Prakash Raj Is Ready To Take Back His Resignation On One Condition, Prakash Raj,-TeluguStop.com

అయితే ఇందులో మంచు విష్ణు భారీ మెజార్టీతో గెలుపొందాడు.దీంతో ప్రకాష్ రాజ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఉన్నటువంటి తన సభ్యత్వానికి రాజీనామా చేశాడు.

దీంతో తాజాగా నూతన మా అధ్యక్షుడు మంచు విష్ణు ఈ విషయంపై స్పందిస్తూ ప్రకాష్ రాజ్ అంటే తనకు చాలా ఇష్టమని దాంతో అతడి రాజీనామా ఆమోదించనని సంచలన వ్యాఖ్యలు చేశాడు.

దీంతో తాజాగా ప్రకాష్ రాజ్ తన ప్యానల్ లో పోటీ చేసినటువంటి సభ్యులతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు.

ఇందులో భాగంగా ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ మా నూతన అధ్యక్షుడు మంచు విష్ణు చెప్పినట్లు తాను తన రాజీనామా ని వెనక్కి తీసుకుంటానని కానీ అంటూ సరైన షరతు పెట్టాడు.ఇంతకీ ఆ షరతు ఏమిటంటే టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలలో తెలుగు వాళ్ళు మాత్రమే కాకుండా ఎవరైనా సరే పోటీ చేయవచ్చనే నిబంధనను మార్చకూడదని ఒకవేళ మారిస్తే ఖచ్చితంగా తన రాజీనామాను ఆమోదించాలని పేర్కొన్నాడు.

అలాగే తాను మా అసోసియేషన్ లో మెంబెర్ గానో లేక పోటీ చేస్తున్న వారిని గెలిపించేందుకు ఓటు వేయడానికో ఉండటం ఇష్టం లేదని ఒకవేళ తాను చెప్పినట్లు చేస్తే కచ్చితంగా తన రాజీనామాని వెనక్కి తీసుకుంటానని షరతు పెట్టాడు.మరి నూతన అధ్యక్షుడు మంచు విష్ణు ప్రకాష్ రాజు పెట్టిన షరతు విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.

Telugu Maa, Manchu Vishnu, Prakash Raj, Telugu, Tollywood-Movie

ఇక మా ఎన్నికలలో మంచు విష్ణు గెలిచిన విషయంపై స్పందిస్తూ మా ఎన్నికలలో ఎవరు గెలిచినా సరే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్లకు మరియు సభ్యులకు మంచి చేయాలని కాబట్టి ఆ విషయంలో తేడా వస్తే ఖచ్చితంగా ప్రశ్నిస్తానని తెలిపాడు.అంతేకాకుండా ఇప్పటి వరకు మంచు విష్ణు పలు హామీలు ఇచ్చారని వాటిని నెరవేర్చడానికి కృషి చేయాలని వీలైతే తమ వంతు సహాయం కూడా చేస్తామని తెలిపాడు.ఇక తన ప్యానల్ తరపు నుంచి గెలిచిన 11 మంది సభ్యులను రాజీనామా చేస్తున్నామని కూడా తెలిపాడు.అలాగే ఈ విషయం గురించి మాట్లాడుతూ ఎలాంటి గొడవలు లేకుండా పనులు జరగాలంటే గెలిచిన వారి సభ్యులు టీమ్ లో ఉంటే బాగుంటుందని అలా కాకుండా ఇతర సభ్యులు ఇంకో టీమ్ లో ఉండడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని అందువల్లనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు క్లారిటీ ఇచ్చాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube