నన్ను ఇంట్లో అందరు పిచ్చోడు అనుకుంటారు : ప్రకాష్ రాజ్

ప్రకాష్ రాజ్ .ఒక నటుడిగా అతడికి సాటి లేరు ఎవరు.

 Prakash Raj About His Daily Routine Details, Prakash Raj, Prakash Raj Family, Pr-TeluguStop.com

తనదైన పాత్ర దొరికితే దాన్ని చీల్చి చెండాడేస్తాడు.అందుకే అతడి పేరు చెప్తే చాలు అందరు భయపడి పోతారు.

ఇక ప్రకాష్ రాజ్ మాత్రం తనకు అంత సీన్ లేదు అంటున్నాడు.ఈ మధ్య కాలంలో ఒక మీడియా సంస్థ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో బయట ఎదో పొడిచేస్తాను, పీకేస్తాను అని అంత అనుకుంటారు కానీ అసలు ఇంటికి వస్తే అలాంటిది ఏమి ఉండదని బాంబు పేల్చారు ప్రకాష్ రాజ్.

షూటింగ్ ముగించుకొని ఇంటికి వస్తే మా అమ్మ నాకు మందులు లేవు అని అడుగుతుంది, నా భార్య ఇంట్లో చిన్న చిన్న పనులు కూడా చేయను అంటూ నాపై చిరాకు పడుతూ ఉంటుంది, నా పిల్లలు నాకు టెక్నీకల్ గా నాలెడ్జ్ లేదు అని అంటూ ఆట పట్టిస్తూ ఉంటారు అంటూ తన ఫ్యామిలీ ముచ్చట్లను తీరిగ్గా మీడియా తో పంచుకున్నారు.ఇక అందరి మొగాళ్ళలా నాకు కూడా కుటుంబం తప్ప మరొక ప్రపంచం ఉండదని, టైం దొరికితే నా పాత స్నేహితులతో మందు కొడతా అని లేదంటే ఏదైనా పుస్తకాలు చదువుకుంటున్నాను అని చెప్పారు ప్రకాష్ రాజ్.

Telugu Prakash Raj, Prakashraj-Movie

బాగా పాత హిందీ సినిమాలు చూడటం అంటే బాగా ఇష్టమని చెప్పారు.నాకు నా ప్రియరిటి లిస్ట్ లో మొదట నా తల్లి, ఆ తర్వాత భార్య, ఆ తర్వాత పిల్లలు మాత్రమే, మిగతా అంత సెట్స్ లో ఉన్నత వరకే.ఇంటికి వస్తే నేను అందరి మొగాళ్ళ లాగానే మాములు కొడుకును, భర్తను మరియు తండ్రిని అంటూ చెప్పుకోచ్చారు.ఇంకా అప్పుడప్పుడు నా ఇంట్లోని గార్డెన్ లో టైం గడపడానికి ఇష్ట పడతానని, పండ్లు, కురగాయలు కూడా పండిస్తానని తెలిపాడు.

Telugu Prakash Raj, Prakashraj-Movie

ఇక మా ఫ్యామిలి మెంబర్స్ అయితే అప్పుడప్పుడు నాకు పిచ్చి అంటూ నవ్వుతు ఉంటారని తెలిపాడు ప్రకాష్ రాజ్.ఇక ఈ మధ్య కాలం లో తాత పాత్రలను కూడా చేస్తుండటం పట్ల తనకేమి అసహనం లేదని కూడా చెప్పాడు.తెలుగు వారు నాకు అన్నం పెట్టారని వారికి సదా కృతజ్ఞుడిగా ఉంటాను అని చెప్పారు.చాల మంది తాను లేట్ గా షూటింగ్ కి వస్తానని, సరిగ్గా టైం ఇవ్వనని, ఎక్కువ రెమ్యునరేషన్ అడుగుతానని అపోహ పడుతూ ఉంటారు కానీ అవన్నీ నిజాలు కాదు అని చెప్పారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube