ప్రజాపాలన అభయహస్తం లోగోను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.ఈ మేరకు ఆరు గ్యారెంటీల దరఖాస్తు ఫాంను ఆయన విడుదల చేశారు.
తెలంగాణ వ్యాప్తంగా రేపటి నుంచి జనవరి 6వ తేదీ వరకు ఆరు గ్యారెంటీల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగనుంది.దరఖాస్తు ఫాంను విడుదల చేసిన అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అభయహస్తం ఆరు గ్యారెంటీల్లో ఇప్పటికే రెండు పథకాలను అమలు పరిచామని తెలిపారు.
ఇచ్చిన మాటను కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుంటుందన్నారు.ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్తే ప్రజలకు సరైన న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందిస్తామని తెలిపారు.ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రజావాణిని నిర్వహిస్తున్నామన్న సీఎం రేవంత్ రెడ్డి ఎక్కువగా భూ సమస్యలపైనే ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు.
ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం కలిగించాలని తెలిపారు.







