ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్( KA Paul ) మొన్నటివరకు వైసీపీకి( YCP ) అనుకూలంగానే ఉన్నట్లుగా స్టేట్మెంట్ లు ఇస్తూ… టిడిపి, జనసేన లను టార్గెట్ చేసుకుని తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వచ్చారు.అయితే అకస్మాత్తుగా వైసిపిని టార్గెట్ చేసుకున్నకేఏ పాల్ తనదైన శైలిలో విమర్శలతో విరుచుకుపడ్డారు.
ఇటీవల వైసిపి ఎంపీ విజయసాయిరెడ్డి తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
దీనిపై ఘాటుగా స్పందించిన కే ఏ పాల్ విజయ్ సాయి రెడ్డిని,( Vijayasai Reddy ) వైసీపీని టార్గెట్ చేసుకుని తెలంగాణ రాష్ట్రంలో త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Govt ) పడిపోతుందని విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
దీనిపై తాజాగా స్పందించిన పాల్ … నువ్వేమైనా బిజెపి అధికార ప్రతినిధివా లేక మోదికి తొత్తువా అంటూ ప్రశ్నించారు.ఏపీలో మరో రెండు నెలల్లో ఏమవుతుందో తెలుసా అంటూ.
ఏపీలో ఓడిపోవడానికి సిద్ధమా అంటూ విజయ సాయి రెడ్డిని పాల్ ప్రశ్నించారు.
ఏపీలో వైసీపీని పడగొట్టే దమ్ముందా ? ఐదేళ్లపాటు అధికారంలో ఉండి పోలవరం ప్రాజెక్టును( Polavaram Project ) పూర్తి చేయలేదని, ఉద్యోగాలు కల్పనపై ఎప్పుడైనా బిజెపితో మీరు పోరాడారా అంటూ పాల్ ప్రశ్నించారు.ప్రత్యేక హోదాపై( AP Special Status ) ఎప్పుడైనా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంతో యుద్ధం చేశారా అంటూ నిలదీశారు.మోదీ తొత్తులతో యుద్ధం.
మన విశాఖతో సిద్ధం పోస్టర్ ను విడుదల చేసిన కేఏ పాల్ తాను మాత్రమే విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడగలనని ధీమా వ్యక్తం చేశారు.
ఎంపీ విజయసాయిరెడ్డి పై ఎన్నికల బరిలో తాను పోటీకి దిగుతున్నానని , ఓట్లు చీలకుండా ఉండాలంటే తనను విశాఖ ఎంపీగా ఎన్నుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.ఫిబ్రవరి 17న విశాఖలో ప్రజాశాంతి పార్టీ మీటింగ్ నిర్వహిస్తున్నామని ప్రకటించారు.ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్ పై( CM Jagan Mohan Reddy ) విమర్శలు చేశారు.జగన్మోహన్ రెడ్డి సిద్ధం అంటున్నారని దేనికి సిద్ధమో చెప్పాలని నిలదీశారు.10 లక్షల కోట్ల అప్పులను 20 లక్షల కోట్లు చేయడానికా .ఇచ్చిన మాట తప్పడానికి సిద్ధమా అంటూ పాల్ ఎద్దేవా చేశారు.తాను ఏడు హామీలతో ఏపీలో అప్పులు తీరుస్తానని పాల్ ప్రకటించారు.