తెలుగులో ఎక్కువ సంఖ్యలో సినిమాలు చేసినా సక్సెస్ రేట్ తక్కువగా ఉన్న హీరోయిన్లలో ప్రగ్యా జైస్వాల్ ఒకరనే సంగతి తెలిసిందే.అఖండ సినిమాతో ప్రగ్యా జైస్వాల్ భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నారు.
అయితే అఖండ అంచనాలను మించి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచినా ప్రగ్యా జైస్వాల్ జాతకం మాత్రం మారిపోలేదు.అఖండ సక్సెస్ తర్వాత ప్రగ్యా జైస్వాల్ కు సినిమా ఆఫర్లు ఎక్కువగా రాలేదు.
అయితే ఈ యంగ్ హీరోయిన్ తాజాగా మద్యం ఉత్పత్తులను ప్రమోట్ చేయడం ద్వారా వార్తల్లో నిలవడం గమనార్హం.బ్లాక్ డ్రెస్ లో మద్యం బాటిల్ ల్తో ప్రగ్యా జైస్వాల్ ప్రముఖ కంపెనీకి ప్రచారం కల్పిస్తూ దిగిన ఫోటో నెట్టింట వైరల్ అవుతుండగా నెటిజన్లు ఆమెను తీవ్రస్థాయిలో ట్రోల్ చేస్తున్నారు.
మద్యం బ్రాండ్ ను ప్రమోట్ చేయడంతో పాటు ఆమె చెప్పిన నీతి కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి.బస్టర్ హిట్ గా నిలిచినా ప్రగ్యా జైస్వాల్ జాతకం మాత్రం మారిపోలేదు.
అఖండ సక్సెస్ తర్వాత ప్రగ్యా జైస్వాల్ కు సినిమా ఆఫర్లు ఎక్కువగా రాలేదు.
పాతిక సంవత్సరాలు దాటిన వాళ్లకు మాత్రమే తన పోస్ట్ అని ఆమె చెప్పుకొచ్చారు.డబ్బు కోసం ప్రగ్యా జైస్వాల్ మద్యం బ్రాండ్ ను ప్రమోట్ చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.గతంలో కూడా పలువురు హీరోయిన్లు మద్యం బ్రాండ్లను ప్రమోట్ చేయడం ద్వారా ట్రోల్స్ కు గురైన సంగతి విదితమే.
మద్యం బాటిల్ ను ప్రమోట్ చేసి బాధ్యతాయుతంగా తాగాలంటూ ప్రగ్యా జైస్వాల్ నీతులు చెప్పారు.ఇప్పటివరకు బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే హీరోయిన్లు ఈ విధంగా మద్యం బ్రాండ్స్ ను ప్రమోట్ చేశారు.
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఇదే కల్చర్ రావడం గమనార్హం.నెటిజన్ల ట్రోల్స్ గురించి ప్రగ్యా జైస్వాల్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.భవిష్యత్తులో ప్రగ్యా జైస్వాల్ మద్యం ప్రమోషన్లకు దూరంగా ఉంటే మంచిది.