ప్రముఖ టాలీవుడ్ నటుడు ప్రభాస్ శ్రీను ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.నాకు మోరల్ సపోర్ట్ ఇచ్చిన వ్యక్తి ఎవరంటే నాన్నగారు అని చెబుతానని ప్రభాస్ శ్రీను కామెంట్లు చేశారు.
ప్రస్తుతం రెగ్యులర్ గా మోరల్ సపోర్ట్ ఇస్తున్నది భార్య అని ప్రభాస్ శ్రీను చెప్పుకొచ్చారు.ప్రతి ఒక్కరికీ బ్యాడ్ పీరియడ్ వస్తుందని ప్రభాస్ శ్రీను తెలిపారు.
మనకు సినిమా తప్ప మరేం తెలియవని నా భార్య ఎవరి సపోర్ట్ తీసుకోదని ప్రభాస్ శ్రీను చెప్పుకొచ్చారు.కూతురి 11వ రోజు ఫంక్షన్ కు రాజమౌళి మా ఇంటికి వచ్చారని ప్రభాస్ శ్రీను అన్నారు.
గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ తో చేయడం గ్రేట్ ఎక్స్ పీరియన్స్ అని ప్రభాస్ శ్రీను కామెంట్లు చేశారు.పవన్ ను నేను ఇమిటేట్ చేయడం హరీష్ శంకర్ కు నచ్చిందని పవన్ కూడా ఇమిటేట్ చేయాలని చెప్పడంతో గబ్బర్ సింగ్ లో నేను చేశానని ప్రభాస్ శ్రీను అన్నారు.
గబ్బర్ సింగ్ సినిమా షూట్ సమయంలోనే హిట్ అవుతుందని కాన్ఫిడెన్స్ నాకు ఉందని ఆయన తెలిపారు.ఒక సీన్ లో పవన్ నన్ను బెల్ట్ తో కొట్టాలని ఆయన శ్రీనుగారు తగులుతుందా మీకేమైనా అని అడిగారని ప్రభాస్ శ్రీను చెప్పుకొచ్చారు.నేను మీ ముందు చాలా ఓవర్ యాక్షన్ చేశానని కొట్టండని ఇప్పుడు మీరు కొట్టని పక్షంలో ఏ మూలకు వెళ్లినా ఫ్యాన్స్ విరగ్గొట్టేస్తారని ఆయనతో చెప్పానని ప్రభాస్ శ్రీను అన్నారు.
మీరు నన్ను కొడితే ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతారని పవన్ తో చెప్పానని ప్రభాస్ శ్రీను కామెంట్లు చేశారు.నాలుగైదు దెబ్బలు ఎక్కువేయండి సార్ అని నేను చెప్పానని ప్రభాస్ శ్రీను కామెంట్లు చేశారు.స్టార్ హీరోలు దేవుళ్లు అని కోట్ల సంఖ్యలో అభిమానులు ఉండటం వరం అని ప్రభాస్ శ్రీను అన్నారు.
అభిమానుల ప్రేమ ముందు ఎన్ని మాట్లాడినా వేస్ట్ అని ప్రభాస్ శ్రీను కామెంట్లు చేశారు.