ఆ డైరెక్టర్ కు ఇంటి భోజనం పంపిన ప్రభాస్... సంతోషంలో డైరెక్టర్?

పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ప్రభాస్( Prabhas ) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ఈయన ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ తన నటనతో అందరిని సందడి చేయడమే కాకుండా రియల్ లైఫ్ లో తన అతిథి మర్యాదలతో అందరిని ఆశ్చర్యపరుస్తుంటారు.

 Prabhas Sent A Home Cooked Meal To That Director Happy Director ,prabhas , Aana-TeluguStop.com

ప్రభాస్ తన సినిమా షూటింగ్లోని చిత్ర బృందానికి సన్నిహితులకు మర్చిపోలేనటువంటి ఆతిథ్యాన్ని ఇస్తారనే విషయం మనకు తెలిసిందే.ఇలా ఈయన ఇదివరకే ఎంతోమంది సన్నిహితులకు తన ఇంటి బోజనాన్ని పంపించి తన అతిథి మర్యాదలతో ఆకట్టుకున్నారు.

ఇక ప్రభాస్ ఇచ్చే ఆతిథ్యం గురించి ఇదివరకే ఎంతో మంది సెలబ్రిటీలు ఎంతో గొప్పగా చెప్పారు.ఈ క్రమంలోనే తాజాగా ప్రభాస్ తన ఇంటి భోజనాన్ని ఇండస్ట్రీలో మరొక డైరెక్టర్ కు పంపించారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే సదురు డైరెక్టర్ ప్రభాస్ ఇంటి నుంచి వచ్చిన బోజనానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు.ఇండస్ట్రీలో రైటర్ కమ్ డైరెక్టర్ గా రాణిస్తున్నటువంటి సాయి రాజేష్( Sai Rajesh ) ప్రస్తుతం ఆనంద్ దేవరకొండ( Aanand Devarakonda ) హీరోగా నటిస్తున్న బేబీ సినిమా( Baby Movie )కు దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఈ డైరెక్టర్ కి ప్రభాస్ ఇంటి నుంచి వివిధ రకాల భోజనం తనకు పంపించారని ప్రస్తుతం ప్రభాస్ ఇంటి భోజనాన్ని తాను టేస్ట్ చేస్తున్నా అంటూ ట్విట్టర్ వేదికగా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.అలాగే ప్రభాస్ ఇంటి నుంచి తనకు వచ్చిన కీమా ప్రాన్ పులావ్, మటన్ పులావ్, ఎగ్ నూడిల్స్, చికెన్ మంచూరియావెట్ ఫోటోలను ఈయన ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు.ఇలా ప్రభాస్ తనకు భోజనం పంపించారంటూ డైరెక్టర్ తెలియచేయడంతో ప్రభాస్ అభిమానులు ప్రభాస్ అన్నా దావత్ అంటే మామూలుగా ఉండదు అంటూ పెద్ద ఎత్తున ఈ ఫోటోలపై కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube