చిన్నపిల్లలన్నాక మారాం చేస్తారు, ఎక్కువగా అల్లరి చేస్తారు.అంతమాత్రాన వారు అమాయకంగా అడిగే ప్రతిదీ కొంటూ పోతే వారిని కోరి చెడగొట్టిన వాళ్ళం అవుతాము.
ఒకప్పటి తల్లిదండ్రుల పెంపకానికి, నేటి తరం తల్లిదండ్రుల పెంపకానికి చాలా తేడా వుంది.ఒకప్పుడు అవసరమైనవి మాత్రమే ఇచ్చేవారు.
కానీ ఈనాటి తల్లిదండ్రులు మాత్రం అవసరం అయినవాటికంటే అనవసరమైనవే ఎక్కువగా కొంటూ వుంటారు.తాజా కథ ఇంచుమించు అలాంటిదే.
ఆడి పాడే వయసులో స్కూల్‌కు వెళ్లాలంటే చిన్న పిల్లలకు చాలా కష్టంగా ఉంటుంది.అయితే స్కూల్‌కు తమ బిడ్డ వెళ్లడంలేదని మలేసియాకు చెందిన ఓ తండ్రి తన కూతురిని బుజ్జగించడానికి ఏకంగా కోట్ల రూపాయలు విలువ చేసే బెంజ్ కారు( Benz car ) గిఫ్ట్‌గా ఇచ్చాడు.

మలేషియాకు( Malaysia ) చెందిన పారిశ్రామికవేత్త ఫర్హానా జహ్రా( Farhana Zahra ) ఐదేళ్ల కూతురు ఫాతిమా( Fatima ) అనారోగ్యం కారణంగా గతేడాది స్కూలుకు వెళ్లడం మానేసింది.ప్రస్తుతం అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత కూడా ఫాతిమా స్కూలుకు వెళ్లేందుకు ఇష్టపడలేదు.ఈ క్రమంలో కూతురిని తిరిగి స్కూలుకు ఎలా పంపాలో ఆ తల్లిదండ్రులకు అర్థం కాలేదు.తనకు బెంజ్ కారు గిఫ్ట్ ఇస్తేగాని రోజూ స్కూలుకు వెళ్లానని ఫాతిమా తేల్చి చెప్పింది.
తన కూతురికి లగ్జరీ ఎస్‌యూవీ కారును బహుమతిగా కొనేశారు ఆ తల్లిదండ్రులు.

ఈ విషయాన్ని ఫర్హానా సోషల్ మీడియాలో షేర్ చేయగా ఇపుడు ఆ విషయం తెగ వైరల్ అవుతోంది.ఆమె తన కూతురు స్కూలుకు వెళ్లేలా ప్రోత్సహించేందుకు తన భర్త బెంజ్ కారు బహుమతిగా ఇచ్చాడని గొప్పగా అందులో రాసుకొచ్చినప్పటికీ ఆ సంతోషం ఎంతోసేపు ఆగలేదు.నెటిజన్లు ఆమెను ఓ రేంజులో ఏసుకుంటున్నారు.
అడిగినవన్నీ కొనిచ్చి తల్లిదండ్రులు పిల్లలను చెడగొడుతున్నారని కింద కామెంట్స్ పెడుతున్నారు.








