యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ( Prabhas )హీరోగా తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్టులలో ”సలార్” ( Salaar )ఒకటి.పాన్ ఇండియన్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ పై అంతా భారీ అంచనాలు పెట్టుకున్నారు.
సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ( Prashanth Neel ) తెరకెక్కించిన ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ పార్ట్ 1 సీస్ ఫైర్ అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ రిలీజ్ చేసి అంచనాలు అమాంతం పెంచేయగా ఇప్పుడు అంతా కూడా ట్రైలర్ కోసం ఎదురు చూస్తున్నారు.
కానీ ట్రైలర్ కానీ ఫస్ట్ సింగిల్ కానీ రిలీజ్ చేయలేదు.ఆ అప్డేట్ల కోసమే చూస్తున్న ఆగస్టు చివరికి వస్తున్న ఇంత వరకు మరో అప్డేట్ అయితే లేదు.
కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు మాత్రం శరవేగంగా జరుగుతున్నాయి.
ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్దీ ఒక్కో పని పూర్తి చేసుకుంటూ పోతున్నారు.తాజాగా మేకర్స్ ఈ సినిమా యొక్క డబ్బింగ్ పనులు కూడా స్టార్ట్ చేసారని తెలుస్తుంది. శృతి హాసన్( Shruti Haasan ) తన సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్నీ తెలిపింది.
తన పార్ట్ డబ్బింగ్ ను పూర్తి చేస్తున్నట్టు తెలిపింది.
మాఫియా బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో ప్రభాస్ ఎలాగైనా హిట్ అందుకోవాలని వేచి చూస్తున్నాడు.కాగా ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.హోంబలే వారు భారీ స్థాయిలో హాలీవుడ్ రేంజ్ లో సినిమాను నిర్మిస్తున్నారు.
ఆదిపురుష్ ( Adipurush )వంటి ప్లాప్ తర్వాత ప్రభాస్ నుండి రాబోతున్న సినిమా ఇదే కావడంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతగానో ఈ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు.చూడాలి ఈ సినిమా అయిన ప్రభాస్ కెరీర్ లో బాహుబలి రేంజ్ హిట్ అందుకుంటుందో లేదో.