యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ( Prabhas హీరోగా తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్టులలో ”సలార్”( Salaar ) ఒకటి.సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ( Prashanth Neel ) తెరకెక్కించిన ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ రెండు పార్టులుగా తెరకెక్కుతుండగా మొదటి పార్ట్ ను సెప్టెంబర్ 28న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు.
ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసారు.

ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ నుండి ఇప్పటికే టీజర్ వచ్చి ఆకట్టుకుంది.ఇక ఇప్పుడు నెక్స్ట్ ఏ అప్డేట్ వస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఇక ఈ సినిమా నుండి ట్రైలర్ కానీ ఫస్ట్ సింగిల్ కానీ రిలీజ్ అవుతుంది అని ఎన్నో రోజులుగా రూమర్స్ వస్తున్నప్పటికీ ఎలాంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు.
ఇక నిన్నటి నుండి సలార్ మంత్ స్టార్ట్ అయినప్పటికీ రిలీజ్ విషయంలో క్లారిటీ లేదు.ఇక ఇప్పుడొక షాకింగ్ వార్త వైరల్ అవుతుంది.అది ఏంటి అంటే సలార్ మూవీ పోస్ట్ ఫోన్ అవుతున్నట్టు రూమర్స్ బలంగా వినిపిస్తున్నాయి.ఈ రూమర్స్ కు బలం చేకూరేలా మరో వార్త బయటకు వచ్చింది.
ఇప్పటికే యూఎస్ లో బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి.మరి బుకింగ్స్ చేసుకున్న వారికీ తాజాగా వారి డబ్బులు వెనక్కి ఇచ్చేస్తున్నారని తెలుస్తుంది.
దీంతో ఈ సినిమా వాయిదా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టే చెబుతున్నారు.

సలార్ వాయిదా నిజమే అయితే ప్రభాస్ ఫ్యాన్స్ కు నిరాశ తప్పదు.ఎందుకంటే బాహుబలి సిరీస్ తర్వాత వచ్చిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్( Adipurush ) మూడు కూడా దారుణంగా నిరాశ పరిచాయి.దీంతో ఈ సినిమా అయిన ప్రభాస్ కు హిట్ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో వాయిదా అంటూ షాకింగ్ విషయం వైరల్ అవుతుంది.చూడాలి ఇందులో నిజమెంతో.
కాగా ఈ సినిమాలో శృతి హాసన్( Shruti Haasan ) హీరోయిన్ గా నటిస్తుండగా.హోంబలే వారు భారీ స్థాయిలో హాలీవుడ్ రేంజ్ లో సినిమాను నిర్మిస్తున్నారు.
సెప్టెంబర్ 28న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది.







