పాన్ ఇండియన్ వ్యాప్తంగా మోస్ట్ ఏవైటెడ్ మూవీగా ఉన్న ”సలార్” డిసెంబర్ 22న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.ఈ సినిమాకు మొదటి రోజునే పాజిటివ్ టాక్ రావడంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.
ఈ సినిమాతో ఎన్నో ఏళ్ల అభిమానుల కల నెరవేరింది.పాన్ ఇండియా స్టార్ అయినా తమ హీరో రేంజ్ కు తగ్గ సినిమా రాలేదని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ( Prabhas ) హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ( Prashanth Neel ) దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ ”సలార్”( Salaar ) సినిమాతో ఎట్టకేలకు హిట్ అందుకున్నాడు.బాహుబలి తర్వాత మరో హిట్ అందుకొని ప్రభాస్ ఇప్పుడు ఎట్టకేలకు భారీ హిట్ అందుకోవడంతో అందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

క్రిస్మస్ కానుకగా ఈ సినిమా ఆడియెన్స్ ముందుకు వచ్చి ఈ సెలవులను క్యాష్ చేసుకుంది.అయితే ఇప్పుడు అసలైన పరీక్ష ఈ సినిమాకు ఎదురవ్వనుంది.నిన్నటి వరకు అంటే హాలిడేస్ కావడంతో భారీ కలెక్షన్స్ రాబట్టింది.అయితే ఈ రోజు నుండి మళ్ళీ వీక్ డేస్ స్టార్ట్ అయ్యింది.

మరి మొదటి నాలుగు రోజులు భారీ బుకింగ్స్ నమోదు చేసుకుని రికార్డ్ కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా ఈ రోజు నుండి వర్కింగ్ డేస్ లో ఎలాంటి వసూళ్లు రాబడుతుందో అని అందరు ఆసక్తిగా ఉన్నారు.మరి వీక్ డేస్ లో కూడా మంచి రెస్పాన్స్ లభిస్తే మరిన్ని కలెక్షన్స్ సాధించడం ఖాయం.కాగా ఈ సినిమాలో శృతి హాసన్ ( Shruti Haasan ) హీరోయిన్ గా నటించగా.హోంబలే వారు భారీ స్థాయిలో హాలీవుడ్ రేంజ్ లో సినిమాను నిర్మించారు.
అలాగే రవి బసృర్ సంగీతం అందించారు.







