ప్రభాస్ ఓకే అంటే రూ.200 కోట్లు ఇవ్వడానికి సిద్ధమే.. ప్రభాస్ క్రేజ్ కా బాప్ అంటూ?

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్( Prabhas ) సినిమాలు ఏ రేంజ్ లో కలెక్షన్లు సాధిస్తాయో సలార్, కల్కి 2898 ఏడీ సినిమాలు ప్రూవ్ చేశాయి.

ఈ రెండు సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి ప్రేక్షకులను మెప్పించిన సంగతి తెలిసిందే.

ప్రభాస్ సినిమాలు అందిస్తున్న లాభాలను చూసి ఇతర నిర్మాతలు సైతం షాకవుతున్న పరిస్థితి నెలకొంది.ప్రభాస్ ఓకే అంటే రూ.200 కోట్లు ఇవ్వడానికి కూడా నిర్మాతలు సిద్ధమవుతున్నారు.ప్రభాస్ క్రేజ్, రేంజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ ఆ స్థాయిలో ఉన్నాయని చెప్పవచ్చు.

ప్రభాస్ కల్కి( Kalki ) వరల్డ్ వైడ్ కూడా సంచలనాలు సృష్టిస్తోంది.నార్త్ ఇండియాలో ఈ సినిమాకు ఏకంగా 250 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు వచ్చాయి.

ఆర్.ఆర్.ఆర్ రికార్డ్ ను సైతం ఈ సినిమా బ్రేక్ చేయడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే.

Advertisement

ప్రభాస్ క్రేజ్ కా బాప్ అంటూ నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ప్రభాస్ రాజాసాబ్( Rajasaab ) సంక్రాంతి పండుగ కానుకగా విడుదల కానుండగా ఈ సినిమాతో మారుతి( Maruthi ) రేంజ్ సైతం మారిపోతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.రాజాసాబ్ కు పాజిటివ్ టాక్ వస్తే మారుతికి టాలీవుడ్ ఇండస్ట్రీలోని ఇతర పాన్ ఇండియా హీరోలు ఛాన్స్ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి.

దర్శకుడు మారుతి రెమ్యునరేషన్ కూడా ఒకింత భారీ స్థాయిలో ఉందని సమాచారం అందుతోంది.రాజాసాబ్ సక్సెస్ సాధిస్తే ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో మరిన్ని సినిమాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.ఈ సినిమాకు ప్రభాస్ పరిమితంగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది.

ప్రభాస్ స్క్రిప్ట్స్ సెలక్షన్ లో సైతం సూపర్ అనిపించుకుంటున్నారు.పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ ను కలిగి ఉండటం ప్రభాస్ కు ఎంతగానో మేలు చేస్తుండటం గమనార్హం.

మేకిన్ ఇండియాకు సాయపడండి.. యూఎస్ డిఫెన్స్ కంపెనీలతో రాజ్‌నాథ్ సింగ్
Advertisement

తాజా వార్తలు