రాధేశ్యామ్‌ బడ్జెట్‌ ఎంత? ప్రీ రిలీజ్‌ బిజినెస్ ఎంత? బ్రేక్‌ ఈవెన్ టార్గెట్‌ ఎంత?

ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన రాధేశ్యామ్ సినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.ఈ సినిమాను యు.

 Prabhas Radheshyam Movie Pre Release Business And Break Even Target Details, Pr-TeluguStop.com

వి.క్రియేషన్స్ వారు దాదాపుగా మూడు వందల కోట్ల బడ్జెట్ తో నిర్మించారు.ఈ విషయాన్ని ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ ప్రకటించిన విషయం తెలిసిందే.మూడు వందల కోట్ల బడ్జెట్ సినిమా అంటే కచ్చితంగా ఆ రేంజ్ బిజినెస్ అవ్వాల్సిందే.

ప్రభాస్ సినిమా అవ్వడం వల్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అంతకు మించి అన్నట్లుగా జరిగింది అంటూ వార్తలు వస్తున్నాయి.నిర్మాతల కు లాభాలు దక్కే విధంగా ప్రీ రిలీజ్ బిజినెస్‌ అయింది.

ఈ సినిమా దాదాపు రూ.205 కోట్ల థియేట్రికల్ రైట్స్ ని దక్కించుకోవడం జరిగింది.కేవలం తెలుగు రాష్ట్రాల్లో 105 కోట్లు బిజినెస్ చేసిందని టాక్.ఇక ఈ సినిమా దాదాపు గా 200 కోట్ల నాన్‌ థియేట్రికల్‌ బిజినెస్ చేసింది.సినిమా విడుదల కు ముందే నిర్మాత కు రూ.400 కోట్ల కు పైగా ఆదాయం వచ్చినట్లయింది.రూ.210 కోట్లు వసూలు చేస్తే బ్రేక్ ఈవెన్ సాధించినట్లు.మొదటి వారం లేదా పది రోజుల్లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌ సాధిస్తుందని చాలా నమ్మకం తో మేకర్స్‌ ఉన్నారు.

Telugu Radha Krishna, Pooja Hegde, Prabhas, Radhe Shyam, Radheshyam, Uv-Movie

ప్రభాస్ స్టార్‌ డమ్‌ మరియు ఆయన ఛరిష్మా నేపథ్యం లో మంచి వసూళ్లు నమోదు కావడం ఖాయం.కనుక ఈ సినిమా చాలా తక్కువ సమయంలోనే బ్రేక్‌ ఈవెన్ ను పూర్తి చేస్తుందని అంతా నమ్ముతున్నారు.ప్రభాస్ ప్రతిష్టాత్మక సినిమా అవ్వడం తో అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

 ఈ సినిమా సాహో వసూళ్లను బ్రేక్ చేస్తుంది అంటూ ప్రభాస్ అభిమానులు చాలా నమ్మకం తో ఎదురు చూస్తున్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube