టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్( Hero Prabhas ) ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తున్న తెలిసిందే.ఇటీవల సలార్ మూవీతో ప్రేక్షకులను పలకరించిన ప్రభాస్ ప్రస్తుతం కల్కి, రాజాసాబ్, స్పిరిట్, సలార్ 2, ప్రాజెక్ట్ కె వంటి సినిమాలలో నటిస్తూ క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతున్నారు ప్రభాస్.
ఇకపోతే ప్రభాస్ నటిస్తున్న కల్కి సినిమా త్వరలోనే విడుదల కానున్న విషయం తెలిసిందే.ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి అశ్వినీదత్ నిర్మిస్తున్నారు.ఇకపోతే ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో తయారవుతున్న సినిమా ప్రాజెక్ కె/కల్కి( Kalki ). ఈ సినిమా మీద భారీగా అంచనాలు ఉన్నాయి.
ప్రభాస్ యావరేజ్, ఫ్లాప్ సినిమాలు( Prabhas Flop Movies ) కూడా మంచి వసూళ్లు కనబర్చాయి.నైజాం ఏరియాను 62 కోట్ల మేరకు అడ్వాన్స్ మీద ఇచ్చినట్లు తెలుస్తోంది.ఆంధ్ర ఏరియాను మాత్రం నాన్ రిటర్నబుల్ అడ్వాన్స్ ను ట్రయ్ చేస్తున్నారని సమాచారం.
రెండో భాగం వుంది కనుక, కాస్త తగ్గినా అందులో సర్దుబాటు చేస్తారనే భరోసా వుంటుంది.అందుకే ఈ మేరకు ఎంక్వయిరీలు బాగానే వస్తున్నాయి.ఉగాదికే కొన్ని మాట మాత్రంగా క్లోజ్ చేసినట్లు తెలుస్తోంది.వరల్డ్ వైడ్ మార్కెట్ వుంది ప్రాజెక్ట్ కల్కికి.
రానా ఈ విషయంలో కీలకంగా పని చేస్తున్నారు.
అయినా తెలుగు రాష్ట్రాలు కూడా కీలకం.బాహుబలి తరువాత ప్రభాస్ కు ఆ రేంజ్ హిట్ మళ్లీ ప్రాజెక్ట్ కల్కి కావచ్చు.దీని తరువాత రెండో భాగం వుంది.
సందీప్ వంగా స్పిరిట్ సినిమా( Spirit Movie ) వస్తుంది.అలాగే సలార్ రెండో భాగం వుంది.
ఇవి కాక మారుతి డైరక్షన్ లో రాజా సాబ్ సినిమా( Raja Saab ) వుంది.మొత్తం మీద ప్రభాస్ డైరీ 2026 చివరి వరకు ఫుల్ అయిపోయినట్లే.