ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన సలార్ మూవీ ట్రైలర్( Salaar Trailer ) తాజాగా యూట్యూబ్ లో విడుదలైంది.15 నిమిషాల్లో ఈ సినిమా ట్రైలర్ 20 లక్షల వ్యూస్ వచ్చాయంటే ఈ ట్రైలర్ కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అర్థమవుతుంది.సలార్ లో ప్రభాస్( Prabhas ) దేవా అనే పాత్రలో కనిపించనున్నారు.నీకోసం ఎర అయినా అవుతా.సొర అయినా అవుతా.నీ ఒక్కడి కోసం అంటూ ప్రభాస్ చిన్నప్పటి పాత్ర చెప్పే డైలాగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ప్రభాస్ ట్రైలర్ లో స్టైలిష్ గా కనిపించారు.ట్రైలర్ లో గూస్ బంప్స్ మూమెంట్స్ ఎక్కువగా ఉన్నాయి.3 నిమిషాల 46 సెకన్ల ట్రైలర్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది.శృతి హాసన్( Shruti Haasan ) ట్రైలర్ లో కనిపించింది కొన్ని సెకన్లే అయినా ఆమె లుక్ బాగుంది.
స్నేహం కోసం ప్రాణమిచ్చే పాత్రలో ప్రభాస్ కనిపిస్తున్నారు.స్టోరీ లైన్ రొటీన్ అయినా ప్రశాంత్ నీల్( Prashant Neel ) స్టైల్ ఈ సినిమాకు ప్లస్ కానుందని చెప్పవచ్చు.
ప్రభాస్ డైలాగ్ డెలివరీ కొత్తగా ఉంది.సినిమా కోసం భారీ స్థాయిలో ఖర్చు చేశారని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.కేజీఎఫ్ ఛాయలు కనిపిస్తుండగా సలార్ పార్ట్ 1 ను( Salaar Part 1 ) షాకింగ్ ట్విస్ట్ తో ముగించనున్నారని తెలుస్తోంది.ట్రైలర్ ను మరింత బెటర్ గా కట్ చేసి ఉండాల్సిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
యాక్షన్ సీన్స్ మాత్రం వేరే లెవెల్ లో ఉండబోతున్నాయని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
ప్రభాస్ ఫ్యాన్స్ కోరుకున్న విజయాన్ని అయితే ఈ సినిమా అందించేలా ఉంది.ట్రైలర్ లో డైలాగ్స్ మరీ నెక్స్ట్ లెవెల్ లో లేవు.ప్రశాంత్ నీల్ సినిమాతో మాత్రం ప్రేక్షకులను మెప్పించడం ఖాయమని చెప్పవచ్చు.
కేజీఎఫ్, కేజీఎఫ్2 ట్రైలర్లు రిలీజైన సమయంలో కూడా ఇలాంటి కామెంట్లు వినిపించినా ఆ సినిమాలు ఏ రేంజ్ లో మెప్పించాయో తెలిసిందే.