కామిక్ కాన్ లో స్టైలిష్ లుక్ లో ప్రభాస్.. ఎంట్రీతోనే అదరగొట్టేసాడు!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్( Pan India Star Prabhas ) అంతర్జాతీయ ఈవెంట్ లోకి ప్రవేశించాడు.

ఈయన నటిస్తున్న ప్రాజెక్ట్ కే సినిమా ఈ ఏడాది శాన్ డియాగో కామిక్ కాన్ లో ప్రదర్శింప బడుతున్న విషయం తెలిసిందే.

ఇదే మన ఇండియన్ మూవీ ఈ ఇంటర్నేషనల్ ఈవెంట్ లో మొట్ట మొదటిసారిగా ఎంట్రీ ఇచ్చింది.ప్రభాస్ హీరోగా దీపికా పదుకొనె హీరోయిన్ గా తెరకెక్కుతున్న లేటెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ ప్రాజెక్ట్ కే( Project K ).

పాన్ వరల్డ్ మూవీగా టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్( Director Nag Ashwin ) ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.అంతేకాదు ఇందులో బిగ్ బి అమితాబ్ బచ్చన్, దిశా పటానీ, కమల్ హాసన్ వంటి స్టార్స్ భాగం అవ్వడంతో ఈ సినిమాపై మరింత ఈగర్ గా అన్ని ఇండస్ట్రీల వారు ఎదురు చూసేలా చేస్తున్నారు.ఇదిలా ఉండగా ఈ ఈవెంట్ లో ప్రాజెక్ట్ కే టీమ్ నుండి ప్రభాస్, దీపికా పదుకొనె, నాగ్ అశ్విన్ పాల్గొంటున్నారు.

మరి ఈ ఈవెంట్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది.దీంతో ప్రభాస్ ఎంట్రీ( Prabhas at San Diego Comic-Con ) గ్రాండ్ గా ఇచ్చాడు.ప్రభాస్ సూపర్ స్టైలిష్ గా ఈ ఈవెంట్ కు చేరుకున్నాడు.

Advertisement

బ్లూ కలర్ సూట్ లో గత కొన్నేళ్లలో ప్రభాస్ ను ఎప్పుడు చూడనంత స్టైలిష్ లుక్ లో ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేస్తున్నాడు.దీంతో ఈ పిక్ ఇప్పుడు సెన్సేషనల్ అయ్యింది.

డార్లింగ్ మునుపటిలా ఆకట్టుకునే లుక్ లోకి మారిపోయాడు అని ఫ్యాన్స్ అంతా సంతోషంగా ఉన్నారు.

ఇక ఇదే ఈవెంట్ లో ఈ సినిమా నుండి టైటిల్ అండ్ టీజర్( Project K Title Teaser ) రాబోతున్నాయి.అందుకే ఫ్యాన్స్ తో పాటు యావత్ ఇండియా ఈ అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు.జులై 20న యూఎస్ లో, 21న ఇండియాలో ఈ సినిమా నుండి టైటిల్ అండ్ టీజర్ రాబోతున్నట్టు మేకర్స్ చెప్పడంతో ఎలా ఉంటాయో అనే ఆసక్తి అందరిలో నెలకొంది.

కాగా ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్( Vyjayanthi Movies Banner ) పై 500 కోట్ల భారీ బడ్జెట్ తో అశ్వనీ దత్ నిర్మిస్తుండగా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.ఇక ఈ సినిమాకు సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు.

ఎంవీవీ బీజేపీ వైపు చూస్తున్నారా ? అందుకే పోటీ నుంచి తప్పుకున్నారా ? 
Advertisement

తాజా వార్తలు