యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్( Prabhas ) హీరోగా రూపొందిన ఆదిపురుష్ ( Adhipurush movie )సినిమా యొక్క విడుదల తేదీ కన్ఫర్మ్ అవ్వడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.టీజర్ విడుదల అయిన సమయంలో ఇదేం సినిమారా బాబు అంటూ పెదవి విరిచారు.
ఇది ఒక చిన్న పిల్లల సినిమా అంటూ చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేశారు.కానీ ఆదిపురుష్ సినిమా యొక్క ట్రైలర్ విడుదల అయిన తర్వాత మొత్తం మారిపోయింది.
ఆదిపురుష్ సూపర్ హిట్ అవ్వడం ఖాయం అంటూ ధీమా ను అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.రికార్డ్ బ్రేకింగ్( Record breakings ) వసూళ్లను దక్కించుకోవడం ఖాయం అంటూ అంతా నమ్మకం గా ఉన్నారు.
ఆదిపురుష్ యొక్క కలెక్షన్స్ కచ్చితంగా దుమ్ము లేపడం ఖాయం అన్నట్లుగా అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ప్రభాస్ ఆదిపురుష్ సినిమా కచ్చితంగా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాదిస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.అదే నిజం అయితే ప్రభాస్ ఇతర సినిమాల పంట పండినట్లే అంటూ నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.సోషల్ మీడియాలో ఆదిపురుష్ యొక్క హంగామా ప్రస్తుతం ఓ రేంజ్ లో ఉంది.
అదే రేంజ్ కొనసాగి ఆదిపురుష్ సినిమా భారీ గా వసూళ్లు నమోదు చేస్తే వెంటనే విడుదల కాబోతున్న సలార్( Salaar movie ) సినిమా కూడా వెయ్యి కోట్ల వరకు వసూళ్లు సొంతం చేసుకునే అవకాశాలు లేకపోలేదు.

అంతే కాకుండా ఆ తర్వాత రాబోతున్న ప్రాజెక్ట్ కే మరియు స్పిరిట్ సినిమా ఆ తర్వాత మారుతి దర్శకత్వం లో రూపొందబోతున్న రాజా డీలక్స్ సినిమా లు కూడా భారీ గా మార్కెట్ ను దక్కించుకోవడం ఖాయం అన్నట్లుగా అభిప్రాయం వ్యక్తం అవుతోంది.ఆదిపురుష్ సినిమా ఫలితాన్ని బట్టి ప్రభాస్ యొక్క ప్రతి సినిమా ఫలితం మరియు బిజినెస్ ఆధార పడి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.