మంచు విష్ణు 'కన్నప్ప' లో ప్రభాస్ లుక్స్ లీక్..ఈ రేంజ్ లో ఉంటే ఇక తిరుగుండదు!

మన టాలీవుడ్ ఆస్కార్ రేంజ్ కి ఎదగడం వల్ల టాలీవుడ్ స్టార్ హీరోలందరూ అదే రేంజ్ ప్రాజెక్ట్స్ ని సెట్ చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు.

పోటీ ఒక రేంజ్ లో పెరిగిపోయింది.

చిన్న హీరోల దగ్గర నుండి పెద్ద హీరోల వరకు ప్రతీ ఒక్కరు ఈ పోటీ లో ముందు ఉండాలని తెగ కష్టపడుతున్నారు.ఇప్పుడు ఈ జాబితాలోకి మంచు ఫ్యామిలీ కూడా చేరింది.

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చిన మంచు మోహన్ బాబు,( Mohan Babu ) కెరీర్ ప్రారంభం లో క్యారక్టర్ ఆర్టిస్టు రోల్స్ మరియు విలన్ రోల్స్ ద్వారా మంచి పేరు తెచ్చుకున్నాడు.విలన్ గా ఒక రేంజ్ లో పాపులర్ అయ్యినప్పటికీ కూడా ఆ తర్వాత సొంతంగా నిర్మాణ సంస్థ ని ప్రారంభించి, తనని తానూ హీరో గా పెట్టి సినిమాలు తీసి గ్రాండ్ సక్సెస్ లు అందుకున్నాడు.

చిరంజీవి తరం లో టాప్ స్టార్ హీరోస్ లో ఒకడిగా నిలిచాడు.

Prabhas Look From Manchu Vishnu Kannappa Movie Goes Viral Details, Prabhas ,prab
Advertisement
Prabhas Look From Manchu Vishnu Kannappa Movie Goes Viral Details, Prabhas ,prab

కానీ హీరో గా మోహన్ బాబు ఇమేజి ఫేడ్ అయ్యినప్పుడు ఆయన కొడుకులుగా వచ్చిన మంచు విష్ణు, మంచు మనోజ్ స్టార్స్ కాలేకపోయారు.మీడియం రేంజ్ హీరోలు కాదు కదా, కనీసం ఒక మోస్తారు రేంజ్ మార్కెట్ ని కూడా ఏర్పర్చుకోలేకపోయారు.అందువల్ల మంచు ఫ్యామిలీ సినిమాలకు మార్కెట్ గుండు సున్నా అయ్యింది.

రీసెంట్ గా వీళ్ళ నుండి విడుదలైన సినిమాలు సున్నా షేర్ ని సంపాదించుకున్నాయి.అలాంటి సమయం లో మంచు విష్ణు ( Manchu Vishnu ) మరో రిస్క్ చేసాడు.

తన డ్రీం ప్రాజెక్ట్ కన్నప్ప( Kannappa ) ని ఈమధ్యనే ప్రారంభించాడు.ఇందులో సౌత్ లో ఉన్న సూపర్ స్టార్స్ అందరూ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

అందులో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్( Prabhas ) ఒకడు.పాన్ ఇండియా రేంజ్ లో తనని మించిన సూపర్ స్టార్ ప్రస్తుతం ఎవరూ లేరు అని నిరూపించుకున్న ప్రభాస్, ఈ కన్నప్ప చిత్రం లో ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు అని అధికారిక ప్రకటన రావడం తో ఈ చిత్రం పై క్రేజ్ పెరిగింది.

Prabhas Look From Manchu Vishnu Kannappa Movie Goes Viral Details, Prabhas ,prab
దానిమ్మ ర‌సంలో ఇవి క‌లిపి సేవిస్తే..ఆ జ‌బ్బులు మాయం!

ఇందులో ప్రభాస్ మహా శివుడిగా కనిపించబోతుండగా, నయనతార పార్వతి దేవి గా నటిస్తుంది.ఈ చిత్రం లో ప్రభాస్ లుక్ ఇలాగే ఉండబోతుంది అని ఒక ఆర్ట్ బయటకి లీక్ అయ్యింది.సరిగ్గా ఈ ఆర్ట్ లో ఉన్న విధంగానే ప్రభాస్ లుక్ ని డిజైన్ చేస్తారట.

Advertisement

ఆయన అభిమానులకు ఈ పాత్ర చిరకాలం గుర్తుండిపోయేలా ఉంటుందట.ఇందులో ప్రభాస్ 10 నిమిషాలకు పైగానే వెండితెర పై కనిపిస్తాడట.

కేవలం ప్రభాస్ మాత్రమే కాదు, మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా ఈ చిత్రం లో ఒక ముఖ్య పాత్ర పోషించబోతున్నాడు.ఇంకా చాలా మంది సూపర్ స్టార్స్ ఈ సినిమాలో కనిపిస్తారట, చూడాలి మరి.

తాజా వార్తలు