''కల్కి'' నుండి ఇంట్రెస్టింగ్ ఇన్ఫో.. సెట్స్ లో లోకనాయకుడితో డార్లింగ్!

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా దీపికా పదుకొనె హీరోయిన్ గా తెరకెక్కుతున్న లేటెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 AD ( Kalki 2898-AD ).పాన్ వరల్డ్ మూవీగా టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ( Nag Ashwin ) ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

 Prabhas Kalki 2898-ad Shoot Update, Prabhas, Kalki 2898-ad, Aswani Dutt, Deepika-TeluguStop.com

ఈ సినిమాపై డార్లింగ్ ఫ్యాన్స్ ఎన్నో హోప్స్ పెట్టుకుని సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.

ఇది పాన్ వరల్డ్ మూవీ కావడంతో ఈ సినిమా కోసం అన్ని ఇండస్ట్రీల స్టార్స్ ను నాగ్ అశ్విన్ తీసుకున్న విషయం విదితమే.

ఇప్పటి వరకు ఇందులో బిగ్ బి అమితాబ్ బచ్చన్, దిశా పటానీ, కమల్ హాసన్ వంటి స్టార్స్ భాగం అవ్వడంతో ఈ సినిమాపై ముందు ఉన్న అంచనాల కంటే మరింత హైప్ పెరిగింది.

ఇప్పటికే రిలీజ్ అయినా గ్లింప్స్ అందరిని ఆకట్టు కోవడమే కాకుండా ఈ సినిమాపై అంచనాలు పీక్స్ కు వెళ్లేలా చేసాయి.ఇదిలా ఉండగా ఇప్పుడొక ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది.ఈ సినిమా షూట్ ఇప్పటికే చాలా మేర పూర్తి చేసారు.

అయితే కమల్ హాసన్ ను ఈ మధ్య ఈ సినిమాలో భాగం చేయగా ఈయన పార్ట్ మొదలెట్టలేదు.

ఇటీవలే ప్రభాస్ విదేశాల నుండి రావడంతో ఈయన మళ్ళీ షూట్ లో పాల్గొంటున్నాడు.ప్రస్తుతం కల్కి షూట్ హైదరాబాద్ లో జరుగుతుండగా ప్రభాస్ ఇంకా కమల్ హాసన్ లపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తుంది.సెట్స్ నుండి కమల్ హాసన్ పిక్ బయటకు రావడంతో ఇది వైరల్ అయ్యింది.

కాగా ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై 500 కోట్ల భారీ బడ్జెట్ తో అశ్వనీ దత్( Aswani Dutt ) నిర్మిస్తుండగా సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube