ప్రభాస్.. గోపీచంద్ గొడవ పడింది ఆ హీరోయిన్ కోసమేనా?

బాలకృష్ణ వ్యాఖ్యాతగా ప్రసారమవుతున్న ఆన్ స్టాపబుల్ కార్యక్రమం ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది.ఇప్పటికే మొదటి సీజన్ మంచి సక్సెస్ కావడంతో రెండవ సీజన్ కూడా ప్రారంభించారు.

 Prabhas Gopichand Fight For Trisha During Varsham Movie Details, Prabhas,gopicha-TeluguStop.com

ఈ కార్యక్రమం కూడా చాలా మంచి ఆదరణ సొంతం చేసుకుంది.ఇక ఈ కార్యక్రమం తాజా ఎపిసోడ్లో ప్రభాస్ పాల్గొన్న విషయం మనకు తెలిసిందే.

అయితే ప్రభాస్ ఎపిసోడ్ ను రెండు భాగాలుగా ప్రసారం చేయనున్నారు.మరొక భాగం కూడా నేడు ప్రసారం కానుంది.

ఇక ఈ ఎపిసోడ్ లో గోపీచంద్ కూడా పాల్గొనందుకు.

ఈ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ మీరిద్దరూ 2008లో ఒక హీరోయిన్ కోసం గొడవపడ్డారట అని ప్రశ్నించడంతో ప్రభాస్ ఈ గొడవతో నాకేం సంబంధం లేదు అన్నట్టు గోపీచంద్ వైపు చూసాడు.

అయితే గోపీచంద్ మాత్రం 2008 కాదు సార్ 2004 గొడవపడ్డామని చెప్పారు.మరి ఆ హీరోయిన్ ఎవరు అని అడగడంతో త్రిష అంటూ గోపీచంద్ సమాధానం చెప్పారు.

ఆ సమాధానం విన్నటువంటి బాలకృష్ణ ఒక్కసారిగా షాక్ అయ్యారు.అయితే ప్రభాస్ మాత్రం తనకోసం మనం ఎప్పుడు గొడవ పడ్డాం రా అన్నట్టు ఓ లుక్ వేశాడు.

ఇక త్రిషతో గొడవ గురించి గోపీచంద్ తెలిపారు.2004వ సంవత్సరంలో వర్షం సినిమా సమయంలో ప్రభాస్ నేను ఇద్దరు కూడా త్రిష కోసం గొడవపడి కొట్టుకున్నాం సర్ అంటూ క్లారిటీ ఇచ్చారు.గోపీచంద్ ఇలా సమాధానం చెప్పడంతో నీ ఒంగోలు తెలివితేటలు నా దగ్గర చూపించకు అంటూ బాలయ్య సెటైర్లు వేశారు.మొత్తానికి ఈ ప్రోమో అందరిని ఎంతగానో ఆకట్టుకుంటుంది.

మరి ఈ ఎపిసోడ్లో భాగంగా ప్రభాస్ గోపిచంద్ ఇంకా ఎలాంటి విషయాల గురించి తెలియజేయునన్నారే విషయం తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube