యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో రూపొందిన సలార్ సినిమా( Salaar ) విడుదలకు మరో మూడు రోజుల సమయం మాత్రమే ఉంది.యూఎస్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున ప్రీమియర్ లకు సిద్ధం అవుతున్నారు.
అంతే కాకుండా సినిమా యొక్క వసూళ్ల విషయంలో లక్షలకు లక్షలు బెట్టింగ్ లు పెడుతున్నారు.వెయ్యి కోట్ల వసూళ్లు బ్రేక్ చేయడం సలార్ కు మొదటి రెండు లేదా మూడు వారాల్లోనే సాధ్యం అంటూ చాలా మంది గట్టిగా వాదిస్తున్నారు.
అయితే మరో వైపు కొందరు ఫ్యాన్స్ మాత్రం ఆందోళనతో కనిపిస్తున్నారు.

సలార్ సినిమా కి ముందు ప్రభాస్ నటించిన సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ సినిమా లు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి.అందుకే ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందో అనే ఆందోళన వ్యక్తం అవుతోంది.సోషల్ మీడియా లో( Social media ) సినిమా గురించి పైకి చాలా ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నా కూడా కొందరు మాత్రం ఆందోళనతో ఉన్నారు అనేది అందరూ ఒప్పుకోవాల్సిన విషయం.
ఈ నేపథ్యం లో సలార్ సినిమా కచ్చితంగా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుంది అనే నమ్మకం ను కలిగించే విధంగా ప్రమోషన్ కార్యక్రమాలు డిజైన్ చేశారు.

ప్రభాస్ తో పాటు యూనిట్ సభ్యులు అందరిని కలిపి రాజమౌళి ఇంటర్వ్యూ చేయడం తో కచ్చితంగా వర్కౌట్ అయ్యే ప్రాజెక్ట్ అన్నట్లుగా కొందరు కామెంట్స్ చేస్తున్నారు.వెయ్యి కోట్ల వసూళ్లు సాధించిన కేజీఎఫ్ 2 కి రెట్టింపు యాక్షన్ తో పాటు, మాస్ ఎలిమెంట్స్ ఉంటాయి అంటూ బలంగా ప్రశాంత్ నీల్ కి చెందిన వారు అంటున్నారు.అయితే డంకీ సినిమా ( Dunki Movie )పోటీ ఉండటం వల్ల ఫలితం విషయం లో మరియు వసూళ్ల విషయం లో కొందరు ఆందోళనతో ఉన్నారు.
మొత్తానికి ప్రభాస్ ఫ్యాన్స్ కొంత మంది కాన్ఫిడెన్స్ తో కనిపిస్తూ ఉంటే మరి కొందరు మాత్రం టెన్షన్ తో ఉన్నారు.