టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ హీరో అభిమానులు అయినా డార్లింగ్ అని ప్రేమగా పిలుచుకునే ఒకే ఒక్క హీరో ప్రభాస్(Prabhas) అనే సంగతి తెలిసిందే.సిగ్గరి అయిన ప్రభాస్ తన సినిమాల ఈవెంట్లలో కూడా చాలా పరిమితంగా మాట్లాడతారు.
పెళ్లికి దూరంగా ఉన్న ఈ స్టార్ హీరో తన పెళ్లి గురించి, పెళ్లి చేసుకునే అమ్మాయి గురించి ఎప్పుడు ప్రకటిస్తారో చూడాల్సి ఉంది.అయితే ఈ మధ్య కాలంలో ప్రభాస్ గురించి నెగిటివ్ వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
ప్రభాస్ లుక్స్ గురించి, ప్రభాస్ గత రెండు సినిమాల ఫలితాల గురించి సోషల్ మీడియాలో(social media) జోరుగా చర్చ జరుగుతోంది.టాలీవుడ్ స్టార్ హీరో ఒకరు ప్రభాస్ కంటే ఎక్కువ రెమ్యునరేషన్ ను డిమాండ్ చేయడంతో ప్రభాస్ రేంజ్, క్రేజ్ తగ్గిందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.
అయితే ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం విమర్శించే వాళ్లకు త్వరలోనే గట్టిగా జవాబు వినిపిస్తుందని కనిపిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ప్రభాస్ నిర్మాతల శ్రేయస్సు కోరుకుంటారని రెమ్యునరేషన్ ఎక్కువే(Remuneration) కావాలనుకుంటే ప్రభాస్ అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి ప్రముఖ నిర్మాణ సంస్థలు క్యూ కడతాయని ఫ్యాన్స్ చెబుతున్నారు.సినిమాలు సరిగ్గా ఆడని సమయంలో ప్రభాస్ ఇచ్చిన స్థాయిలో మరే హీరో రెమ్యునరేషన్ ను వెనక్కు ఇవ్వలేదని ఫ్యాన్స్ గర్వంగా చెబుతున్నారు.

ప్రభాస్ సినిమాల ద్వారా సంపాదించుకున్న డబ్బు తక్కువేనని ప్రభాస్ తన ప్రాపర్టీని బ్యాంక్ లో పెట్టి అప్పు తీసుకున్నారని కూడా ఫ్యాన్స్ ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.ఎంత ఎదిగినా ప్రభాస్ ఒదిగి ఉంటారని రెండు ఫ్లాపులు వచ్చినంత మాత్రాన ప్రభాస్ క్రేజ్ తగ్గదని ప్రభాస్ తర్వాత ప్రాజెక్ట్ ల బిజినెస్ ఇందుకు సాక్ష్యమని కామెంట్లు వినిపిస్తున్నాయి.తమ హీరో గురించి నెగిటివ్ గా కామెంట్ చేయవద్దని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.







