రాధేశ్యామ్‌ విషయంలో మళ్లీ ప్రభాస్‌ ఫ్యాన్స్‌ రచ్చ

ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్‌ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.ఆ సినిమా సాహో విడుదలకు ముందే ప్రారంభమైంది.

అంతకు ముందే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పటి వరకు షూటింగ్ పూర్తి చేసుకోలేదు.ఈ ఏడాది ఆరంభంలో సినిమాను పూర్తి చేయాలని భావించిన కరోనా కారణంగా ఆపేశారు.

దాదాపు ఏడు నెలల గ్యాప్ తర్వాత అన్ని సినిమాల షూటింగులు కూడా ప్రారంభమయ్యాయి కానీ రాధేశ్యామ్‌ సినిమా షూటింగ్ విషయంలో మాత్రం ఇప్పటి వరకు అప్డేట్ లేదు.గత నెలలోనే దర్శకుడు రాధాకృష్ణ సినిమాను సెప్టెంబర్ లో ప్రారంభించబోతున్న ట్లుగా పేర్కొన్నారు.

కానీ సినిమా ప్రారంభం అయింది లేనిది క్లారిటీ ఇంకా ఇవ్వలేదు.ఇటీవల పూజా హెగ్డే స్పందిస్తూ త్వరలోనే రాధేశ్యామ్‌ సినిమా షూటింగ్ లో పాల్గొన్నబోతున్నట్లుగా ఒక ట్వీట్ చేసింది.

Advertisement

అయితే అది ఎప్పుడు అనేది మాత్రం ఆమె క్లారిటీ ఇవ్వలేదు.రాధేశ్యామ్‌ సినిమా షూటింగ్ అప్డేట్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

గతంలో ప్రభాస్ ఫ్యాన్స్ సినిమా అప్డేట్ ఇవ్వడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసి యు.వి.క్రియేషన్స్ బ్యానర్ ను బ్యాన్ చేయాలి అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేయడం జరిగింది.ఇప్పుడు అదే ఫ్యాన్స్ మళ్ళీ సినిమా షూటింగ్ అప్‌ డేట్‌ ఇవ్వాలంటూ చిత్ర నిర్మాణ సంస్థను ట్యాగ్‌ చేస్తూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు.

ఆ విషయమై యూనిట్ సభ్యులు ఇప్పటి వరకు స్పందించక పోవడం వల్ల తీవ్ర ఆగ్రహంకు గురవుతున్నట్లుగా తెలుస్తుంది.ఇప్పటికైనా చిత్ర యూనిట్ సభ్యులు షూటింగ్ కు సంబంధించిన అప్డేట్స్ ను ఇస్తారా లేదో చూడాలి.

ఈ చిత్రంకు సంబంధింన యూరప్‌ షెడ్యూల్‌ గురించి క్లారిటీ ఇవ్వాలంటూ ఫ్యాన్స్‌ డిమాండ్‌ చేస్తున్నారు.

సలార్ రిజల్ట్ పై ప్రశాంత్ నీల్ సంచలన వ్యాఖ్యలు.. ఆ విషయంలో సంతృప్తితో లేరా?
Advertisement

తాజా వార్తలు