అన్ని సీక్వెల్స్ సినిమాలతోనే ప్రభాస్ బిజీ....ఇక కొత్త దర్శకులకు ఛాన్స్ లేనట్టేనా ?

చాలా రోజులుగా ప్రభాస్( Prabhas ) తన కంఫర్ట్ జూన్ దాటి బయటకు రావడం లేదు.తనకు అచ్చొచ్చిన దర్శకులతోనే మళ్లీమళ్లీ సినిమాలు తీస్తూ వస్తున్నాడు.

 Prabhas Back To Back Sequels , Prabhas , Baahubali , Raja Saab, Kalki ,sande-TeluguStop.com

గతంలో రాజమౌళితో బాహుబలి రెండు పాటలు తీశాడు దీనికి దాదాపు 5 ఏళ్ల సమయం తీసుకున్నాడు.ఇక ఆ తర్వాత అన్ని పాన్ ఇండియా ప్రాజెక్ట్ మాత్రమే తెరక్కిస్తున్నాడు.

మొన్నటికి మొన్న సలార్ సినిమాతో ప్రేక్షకులను మిస్మరైజ్ చేసిన ప్రభాస్ ఇప్పుడు దానికి సీక్వెల్ కూడా సిద్ధం కావడంతో దానికి త్వరలోనే షూటింగ్ ప్రారంభించాలనుకుంటున్నారట.మరోవైపు రాజాసాబ్, కల్కి సినిమాల షూటింగ్స్ ను కూడా పూర్తి చేసిన ప్రభాస్ నాగ్ అశ్విన్ కల్కి( Kalki 2898 AD ) కి సంబంధించిన రెండవ పార్ట్ కథని కూడా సిద్ధం చేశాడని తెలుస్తుంది.

మొదటి భాగం పూర్తయిన తర్వాత రెండవ భాగం షూటింగ్ కి కూడా ప్రభాస్ పాల్గొనే అవకాశాలు ఉన్నాయి.సలార్ సీక్వెల్ ఎలాగో తెరకెక్కుతుంది కల్కి కూడా సీక్వెల్ సిద్ధమవుతోంది.ఇక సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ సినిమాని కూడా లైన్ లో పెట్టిన విషయం మన అందరికీ తెలిసిందే.మరోవైపు హను రాఘవపూడి దర్శకత్వంలో కూడా ఒక సినిమాకి ఒకే చెప్పాడు ప్రభాస్.

సందీప్ రెడ్డి అలాగే హను రాగవపూడి( Hanu Raghavapudi ) కథలకు కూడా సీక్వెల్స్ ఉండబోతున్నాయని సమాచారం ప్రస్తుతం టాలీవుడ్ లో సెన్సేషనల్ గా మారింది.ఇలా ప్రతిసారి ప్రభాస్ సీక్వెల్ సినిమా ఓకే చేయడానికి గల కారణం ఏంటా అని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.

అందుకు గల ప్రధాన కారణం ప్రభాస్ ఎప్పుడు తన కంఫర్ట్ జోన్ దాటి బయటకు వెళ్లకపోవడమే.తను పని చేసిన దర్శకులకే మళ్లీ మళ్లీ అవకాశాలు ఇస్తూ ఎక్కువగా కొత్తవారికి అవకాశాలు ఇవ్వకూడదని అనుకుంటున్నాడట.దాంతో కొత్తగా కథలు పట్టుకొని ప్రభాస్ దగ్గరికి వెళ్లేవారి సంఖ్య కూడా తగ్గిపోతుంది.మరి ఈ దాదాపు మరో ఆరేడేళ్ళ పాటు ఇలా సీక్వెల్స్ తీస్తూ ఉంటాడేమో ప్రభాస్.


.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube