యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్( Prabhas ) గత కొంత కాలంగా పూర్తిగా యాక్షన్ సినిమాలే చేస్తున్న విషయం తెలిసిందే.ఒక ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రాన్ని చేయాలని కోరుకుంటున్నట్లుగా ప్రభాస్ స్నేహితుల వద్ద మాట్లాడాడు.
ఆ విషయం సోషల్ మీడియా తో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియా లో ప్రధానంగా ప్రచారం జరిగింది.ఫ్యామిలీ సినిమా ఏమో కానీ ఒక లవ్ స్టోరీ సినిమా మాత్రం ప్రభాస్ నుండి రాబోతున్నట్లుగా సమాచారం అందుతుంది.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్ సన్నిహితుల రిక్వెస్ట్ మేరకు ప్రముఖ దర్శకుడు హను రాఘవపూడి( Hanu Raghavapudi ) ఒక లవ్ స్టోరీ ని సిద్ధం చేశాడట.

సీతారామం( Sitaramam ) సినిమా తో దర్శకుడిగా మంచి గుర్తింపు సొంతం చేసుకున్న దర్శకుడు హను రాఘవపూడి ఇప్పుడు ప్రభాస్ సినిమా కోసం వర్కౌట్ మొదలు పెట్టాడు అంటూ వార్తలు వస్తున్నాయి.యూవీ క్రియేషన్స్ నిర్మాతలు మరియు అశ్విని దత్ కలిసి ఈ సినిమా ను నిర్మించే అవకాశాలున్నాయి.అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఈ లవ్ స్టోరీ కం రొమాంటిక్ డ్రామా ఉంటుంది అనే విశ్వాసాన్ని చిత్ర యూనిట్ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటి వరకు ఈ సినిమా కి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదు.

కానీ అతి త్వరలోనే సినిమా కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడుతుంది అంటూ వార్తలు వస్తున్నాయి.ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలు చాలానే ఉన్నాయి.కనుక అవన్నీ పూర్తి కావడానికి కనీసం సంవత్సరం సమయం పడుతుంది.
అంటే ప్రభాస్ సీతారామం వంటి సినిమా ను మొదలు పెట్టడానికి కనీసం ఏడాది సమయం కావాల్సి ఉంది.వచ్చే సంవత్సరం ప్రభాస్ లవ్ స్టోరీ సినిమా ప్రారంభం అయ్యి 2025 వరకు ప్రేక్షకుల ముందుకు వస్తుందేమో చూడాలి.
ప్రభాస్ ప్రేమ కథ చిత్రం కోసం అభిమానులతో పాటు అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు.