యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్( Prabhas ) హీరోగా రూపొందిన ఆదిపురుష్ సినిమా( Adipurush Movie ) మరో రెండు వారాల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.భారీ అంచనాల నడుమ దాదాపు 550 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా వివాదాలతో మంచి పబ్లిసిటీ దక్కించుకుంటుందని అంతా భావించారు.
రామాయణం ఇతి వృత్తంతో రూపొందిన సినిమా అవడం వల్ల ఎవరో ఒకరు ఈ సినిమా గురించి ఆందోళన చేయడం.లేదంటే వివాదం రాజేయడం వంటివి జరుగుతుందని అంతా భావించారు.
కానీ ఆదిపురుష్ సినిమా కు ఎలాంటి వివాదాలు లేవు, రాముడి సినిమా కోసం ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నామంటూ మాట్లాడుకుంటున్నారు.

ఈ నేపథ్యం లో చిత్ర యూనిట్ సభ్యులు ఉచిత ప్రమోషన్ కోసం చూడకుండా భారీ ఎత్తున డబ్బులు ఖర్చు చేసి ప్రమోషన్ కార్యక్రమాలను( Adipurush Promotions ) నిర్వహించుకోవాల్సిందే అంటూ ఇండస్ట్రీ కి చెందిన కొందరు మాట్లాడుకుంటున్నారు.ఈ వారంలోనే తిరుపతి లో భారీ ఫ్రీ రిలీజ్ వేడుక నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.అక్కడికి వచ్చే అతిరథ మహారధులకు అద్భుతమైన ఆహ్వానం పలికేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నట్లు యూనిట్ సభ్యులు చెబుతున్నారు.

అంతే కాకుండా ఈ మధ్య కాలంలో ఏ ఒక్క సినిమా కి కూడా జరగని విభిన్నమైన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని ఈ సినిమా కు తిరుపతి లో నిర్వహించబోతున్నారు అంటూ యూవీ క్రియేషన్స్ వారు చెప్తున్నారు.ఇక దాదాపు 200 కోట్ల రూపాయలకు తెలుగు రైట్స్ ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు చెబుతున్నారు.ఆ స్థాయిలో సినిమా తెలుగు రాష్ట్రాల్లో రాబట్టగలుగుతుందా అంటే కచ్చితంగా రాబట్టగలుగుతుంది అనే సమాధానం ప్రభాస్ అభిమానుల నుండి వస్తోంది.ప్రతి ఒక్క సినీపేక్షకుడు ఆదిపురుష్ సినిమా చూడాలని వారు కోరుకుంటున్నారు.
ప్రభాస్ వెయ్యి కోట్ల టార్గెట్ తో ఈ సినిమా తో రాబోతున్న విషయం తెల్సిందే.







