యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్( Prabhas ) హీరోగా బాలీవుడ్ లో రూపొందిన ఆదిపురుష్ చిత్రం వచ్చే నెలలో ప్రేక్షకుల ముందు రాబోతున్న విషయం తెలిసిందే.ఇప్పటికే పలు దఫాలుగా వాయిదాలు పడుతూ వచ్చిన ఈ చిత్రాన్ని కచ్చితంగా ఈ సారి విడుదల చేయడం ఖాయం అన్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలు పెట్టారు.
అతి త్వరలోనే సినిమాలు సంబంధించిన ట్రైలర్ ని కూడా విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.ప్రభాస్ ఈ సినిమా ప్రమోషన్ కోసం ఎక్కువ రోజులు కేటాయించాలని నిర్మాతలు కోరినట్లుగా తెలుస్తోంది.
దేశ వ్యాప్తంగా భారీ ఎత్తున ఈ సినిమా ను విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

అందులో భాగంగానే ప్రమోషన్ కార్యక్రమాల కోసం ప్రత్యేక వ్యూహాలను అమలు చేయబోతున్నారు.దేశంలోని 10 ముఖ్య పట్టణాల్లో ఈ సినిమా కు సంబంధించిన భారీ ఈవెంట్స్ నిర్వహించేందుకు గాను ఏర్పాటు జరుగుతున్నాయట.అందులో భాగంగానే ఇప్పటికే కొన్ని ముఖ్య పట్టణాల్లో ఈవెంట్స్ కోసం స్థానికులతో చర్చలు జరుగుతున్నాయి.

మొత్తానికి ఆదిపురుష్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను న భూతో.అన్నట్లుగా నిర్వహించాలని మేకర్స్ భావిస్తున్నారు.అందుకోసం ప్రభాస్ కూడా తన వంతు సహకారాన్ని అందించబోతున్నారు.మే రెండవ వారం నుండి ఆదిపురుష్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల కోసం సమయాన్ని కేటాయించారని తెలుస్తోంది.ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు.

ఆ షెడ్యూల్ పూర్తయిన వెంటనే ఆదిపురుష్ సినిమా ప్రమోషన్( Adipurush ) కార్యక్రమాలకి హాజరు అవుతానంటూ పేర్కొన్నాడట.జాతీయ మీడియా తో పాటు స్థానిక మీడియా.ఇలా అన్ని మీడియాల్లో కూడా రాబోయే నెల రోజుల పాటు ప్రభాస్ సందడి చేయబోతున్నాడు.
బాహుబలి తర్వాత ప్రభాస్ స్టార్డం అమాంతం పెరిగిన విషయం తెలిసిందే.అదే స్థాయిలో ఈ సినిమాను రూపొందించారు.
500 కోట్ల రూపాయల బడ్జెట్ తో పొందిన ఈ సినిమా లో ప్రభాస్ రాముడు పాత్రలో కనిపించబోతున్నాడు.కృతి సనన్( Kriti Sanon ) సీతమ్మ పాత్రలో కనిపించబోతోంది.
ఇక రావణాసురుడిగా బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ నటించిన విషయం తెలిసిందే.







