దిల్ రాజుకు 'ఆదిపురుష్‌' సినిమాపై నమ్మకం ఎందుకు లేదు!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్( Young Rebal Star Prabhas ) హీరో గా రూపొందిన ఆదిపురుష్‌ సినిమా( Adipurush movie ) ఈ నెల 16వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ( People’s Media Factory ) వారు హోల్ సేల్ గా కొనుగోలు చేసి విడుదలకు రెడీ అయ్యారు.

 Prabhas Adipurush Movie Dil Raju Not Interested Details, Young Rebal Star Prabha-TeluguStop.com

దాదాపు 185 కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని ఖర్చు చేసి ఈ సినిమా ను పీపుల్స్ మీడియా వారు కొనుగోలు చేశారు అంటూ వార్తలు వస్తున్నాయి.ఆ విషయం పక్కన పెడితే ఈ సినిమా యొక్క తెలుగు రైట్స్ ని దిల్ రాజు( Dil raju ) కి అమ్మేందుకు నిర్మాతలు తీవ్రంగా ప్రయత్నాలు చేశారట.

కానీ దిల్ రాజు మాత్రం ఆసక్తి చూపించలేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతుంది.కనీసం నైజాం ఏరియా లేదా ఏపీ లో ఏదో ఒక ఏరియా లో దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తే సినిమా పై జనాల్లో ఆసక్తి కలుగుతుందని అంతా భావించారు.

కానీ దిల్ రాజు మాత్రం ఈ సినిమా పట్ల ఆసక్తి చూపించలేదు అనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

Telugu Adipurush, Dil Raju, Telugu, Peoplesfactory, Peoples Factory, Prabhas, Yo

చిత్ర యూనిట్ సభ్యులు అసలు దిల్ రాజు ను సంప్రదించారా లేదా అనేది క్లారిటీ లేదు.కానీ మీడియా లో మాత్రం ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు ప్రచారం చేసేస్తున్నారు.దిల్ రాజుకు ఈ సినిమా పట్ల నమ్మకం లేదా అంటూ జోరుగా చర్చలు సాగుతున్నాయి.

ఇలాంటి సమయంలో ఎంత వరకు సినిమా వసూలు చేయగలుగుతుంది అనేది అందరికీ ఆసక్తిగా ఉంది.దిల్ రాజు చేతి లో ఈ సినిమా పడి ఉంటే ఎక్కువ థియేటర్లలో విడుదల అయ్యి ఉండేది.

లేదంటే అదనపు పబ్లిసిటీ దక్కేది.

Telugu Adipurush, Dil Raju, Telugu, Peoplesfactory, Peoples Factory, Prabhas, Yo

కానీ దిల్ రాజు ఈ సినిమా విషయం లో నమ్మకం తో లేడా.లేదంటే కావాలని పెట్టాడా అనేది క్లారిటీ లేదంటూ సోషల్ మీడియా లో చర్చ జరుగుతుంది.అయితే కొందరు మాత్రం ప్రస్తుతం నిర్మిస్తున్న సినిమా లపై ఎక్కువ దృష్టి పెట్టి ఉన్నాడు కనుక ముందు ముందు ఆ సినిమా లకు ఇబ్బంది కాకుండా ఉండాలనే ఉద్దేశం తో ఇలాంటి భారీ చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేసి రిస్క్‌ తీసుకోవాలని భావించలేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అసలు విషయం ఏంటి అనేది నిర్మాతలు లేదా దిల్ రాజు కాంపౌండ్ నుండి క్లారిటీ వస్తే కానీ చెప్పలేము.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube