ప్రభాస్( Prabhas ) హీరోగా ప్రస్తుతం పలు సినిమాలు రూపొందుతున్న విషయం తెలిసిందే.ఆ సినిమాల్లో ఆదిపురుష్ ( Adipurush ) మరియు సలార్ సినిమాలు ఈ సంవత్సరం లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
ముఖ్యంగా ఆదిపురుష్ సినిమా వచ్చే నెల విడుదల కాబోతున్న నేపథ్యం లో ప్రభాస్ అభిమానులు ఇన్నాళ్లు ఆదిపురుష్ గురించి పెద్దగా పట్టించుకోలేదు.

ఆదిపురుష్ కంటే కూడా ప్రాజెక్ట కే, సలార్, స్పిరిట్, మారుతి( Maruthi ) దర్శకత్వం లో రూపొందుతున్న సినిమాల కోసం ఎక్కువగా వెయిట్ చేస్తున్నాం అంటూ నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియా లో ఫ్యాన్స్ చర్చించుకున్నారు.ఆదిపురుష్ రిలీజ్ డేట్ మళ్లీ మారినా కూడా పెద్దగా పరేషాన్ లేదు అన్నట్లుగా ప్రభాస్ అభిమానులు కామెంట్ చేశారు.తీరా ట్రైలర్ విడుదలైన తర్వాత ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న అన్ని సినిమాల్లోకి ఆదిపురుష్ అత్యధిక కలెక్షన్స్ నమోదు చేయబోతున్న సినిమాగా అభిమానులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
ఆ మధ్య టీజర్ తో నిరాశ పరిచిన చిత్ర యూనిట్ సభ్యులు తాజాగా విడుదల చేసిన ట్రైలర్ తో అంచనాలను ఆకాశానికి తాకేలా చేశారు.

ప్రభాస్ హీరోగా ఒక అద్భుతమైన విజువల్ వండర్ రామాయణం( Ramayanam ) ను చూడబోతున్నాం అంటూ యూనిట్ సభ్యులు ఇచ్చిన నమ్మకంతో సినిమా స్థాయి అమాంతం పెరిగింది.అంతే కాకుండా ప్రభాస్ అభిమానులతో పాటు అందరిని కూడా థియేటర్లకు రప్పించగల సత్తా ఉన్న సినిమా అంటూ ఆదిపురుష్ గురించి ఇప్పుడు అభిమానులు తెగ మాట్లాడుకుంటున్నారు.ప్రాజెక్ట్ కే, సలార్ సినిమా లు ఆదిపురుష్ సినిమా తర్వాతే అంటూ వారు చాలా నమ్మకంగా చెబుతున్నారు.
ప్రభాస్ కెరీర్ లో బాహుబలి( Bahubali ) సినిమా ఎలా అయితే నిలిచిపోయిందో అలాగే ఆదిపురుష్ సినిమా కూడా నిలిచి పోతుందనే నమ్మకాన్ని అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాల వారు ఇంకా సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.జూన్ 16వ తారీఖున ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విజువల్ వండర్( Visual Wonder ) గా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది.








