ఆదిపురుష్ లో ప్రభాస్ రాముడు కాదా..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ స్టార్ డైరక్టర్ ఓం రౌత్ డైరక్షన్ లో వస్తున్న సినిమా ఆదిపురుష్.

రామాయణం కథతో వస్తున్న ఈ సినిమాలో అందరు రాముడిగా ప్రభాస్ నటిస్తాడని అనుకున్నారు కానీ చిత్రయూనిట్ నుండి వచ్చిన లేటెస్ట్ న్యూస్ ప్రకారం ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించడని టాక్.

ఇదేమి ట్విస్ట్ అని షాక్ అవ్వొచ్చు.తీసేది రామాయణమే చేసేది రాముని పాత్రే కాని ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ రాఘవ పాత్రలో కనిపిస్తారట.

Prabhas Adipurush Latest Updates Shocking , Adipurush, Adipurush Update, Bollywo

ఇక సినిమాలో సీత పాత్రలో నటిస్తున్న కృతి సనన్ జానకిగా కనిపిస్తుందట.సినిమాలో రావణాసురుడిగా నటిస్తున్న సైఫ్ ఆలి ఖాన్ ని లంకేష్ పాత్రలో చూపిస్తున్నారట.

మొత్తానికి ఆదిపురుష్ లో పాత్రదారుల పేర్లు ఆడియెన్స్ ని సర్ ప్రైజ్ చేస్తున్నాయి.ఈ సినిమా కోసం ప్రభాస్ 100 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకున్నాడని తెలుస్తుంది.

Advertisement

సినిమాలో ప్రభాస్ తన పాత్రతో ఆడియెన్స్ ని మెస్మరైజ్ చేస్తాడని అంటున్నారు.ఆల్రెడీ ప్రభాస్ రాధే శ్యామ్ రిలీజ్ కు రెడీ కాగా సలార్ కూడా షూటింగ్ జరుపుకుంటుంది.

 రాధే శ్యామ్ తో పాటుగా ఆదిపురుష్ కూడా ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేసే ఛాన్సులు ఉన్నాయని తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు