ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలోనే కాకుండా దేశవ్యాప్తంగా మారుమోగుతున్న పేరు ప్రభాస్.ప్రభాస్ కి ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి మనందరికీ తెలిసిందే.
దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు ప్రభాస్.ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్టులలో నటిస్తూ దూసుకుపోతున్నారు ప్రభాస్.
టాలీవుడ్ బాలీవుడ్ కోలీవుడ్ ఏ ఇండస్ట్రీలో లేని విధంగా వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్టులలో నటిస్తున్నారు.ఆ సంగతి పక్కన పెడితే ప్రభాస్ తాజాగా నటించిన ఆది పురుష్ సినిమా విడుదల అయ్యి మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద దాదాపు 400 కోట్ల కలెక్షన్స్ సాధించి రికార్డులు సృష్టించింది.

కాగా ఇప్పటికే ప్రభాస్( Prabhas ) నటించిన నాలుగు సినిమాలు రూ.300 కోట్ల క్లబ్‌లో చేరిపోయాయి.దీంతో రెబల్ స్టార్ ప్రభాస్ దెబ్బకు బాలీవుడ్ హీరోల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాడు.తాజాగా ఆదిపురుష్ సినిమాపై డివైడ్ టాక్ వినిపించినా కలెక్షన్ల పరంగా దుమ్ము దులిపేశాడు.మొదటి మూడు రోజుల్లోనే రూ.340 కోట్ల గ్రాస్‌ని వసూళ్లు చేసి ఆశ్చర్యపరిచాడు.ఇలా ఐదురోజుల్లోనే రూ.400 కోట్ల మార్క్‌ను కూడా దాటేశాడు.దేశం మొత్తం ఆదిపురుష్ పై విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో ఇలాంటి కలెక్షన్లు రావడం చాలా కష్టం కానీ ప్రభాస్ ప్రభంజనంతో అవన్నీ కొట్టుకుపోయాయి.

ఇప్పటికే బాహుబలి( Baahubali ) రెండు భాగాలతో పాటు సాహో కూడా రూ.300 కోట్ల మార్కును దాటిన జాబితాలో ఉన్నాయి.ఇదే లిస్ట్‌లోకి ఆదిపురుష్( Adipurush ) వచ్చి చేరింది.
ఇప్పటివరకు ఏ హీరోకు ఇలాంటి ఫీట్ సాధ్యపడలేదు.ప్రభాస్‌కు మాత్రమే ఇది సాధ్యమైంది.
బాలీవుడ్‌లో కేవలం ఇద్దరు లేదా ముగ్గురికి సాధ్యమయ్యే ఈ అరుదైన ఫీట్‌ను టాలీవుడ్ నుంచి వచ్చిన ప్రభాస్ క్రియేట్ చేయడంతో వారిప్పుడు ఆశ్చర్యపోతున్నారు.కంటెంట్ లేకపోయినా నెగటివ్ టాక్ తెచ్చుకున్న సినిమాని ఈ రేంజ్ లో విధులను సృష్టిస్తే సలార్( Salaar )తో పాటు ప్రాజెక్ట్ కే చిత్రాలతో వస్తున్న ప్రభాస్‌ను ఇంకెవరు ఆపలేరని వారు అంచనా వేస్తున్నారు.
రాబోయేరోజుల్లో ప్రభాస్ నుంచి బాలీవుడ్ హీరోలకు అతిపెద్ద ప్రమాదమే పొంచి ఉందని అక్కడి క్రిటిక్స్ అంచనా వేస్తున్నారు.