భక్త కన్నప్ప సినిమాలో ప్రభాస్ నటిస్తున్నాడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది వాళ్ళకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు.

ఇక ఇలాంటి క్రమంలోనే చాలామంది నటులు వాళ్ళకంటూ ప్రత్యేక ఇమేజ్ ను అయితే ఏర్పాటు చేసుకుంటారు.

ఇక ముఖ్యంగా మంచు విష్ణు( Manchu Vishnu ) లాంటి నటులు ఇప్పుడిప్పుడే వాళ్లకి సంబంధించిన క్రేజ్ ని ఏర్పాటు చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు.ఇక ఇదిలా ఉంటే ఆయన భక్త కన్నప్ప( Bhakta Kannappa ) అనే సినిమా ని తీస్తున్నారు.

ఈ సినిమా కోసం ఏకంగా 150 కోట్ల భారీ బడ్జెట్ ను పెడుతున్నారు.ఇక ఈ సినిమాలో ఇప్పటికే స్టార్ నటులు నటిస్తున్నారు.మోహన్ లాల్, శరత్ కుమార్,మధుబాల, నయనతార లాంటి నటులు నటిస్తున్నారు.

ఇక వీళ్ళతో పాటుగా ప్రభాస్ ( Prabhas ) కూడా ఈ సినిమాలో శివుడి క్యారెక్టర్ లో నటిస్తున్నట్టు చాలా రోజుల నుంచి వార్తలైతే వస్తున్నాయి.ఇక దీనికి సంబంధించిన మ్యాటర్ కూడా ఇప్పుడు చాలా వరకు వైరల్ అవుతుంది.

Advertisement

ఇక ఇప్పుడు ఫిబ్రవరి 17 వ తేదీ నుంచి 19వ తేదీ వరకు మూడు రోజులు ప్రభాస్ ఈ సినిమా కోసం తన డేట్స్ ని కేటాయించినట్టుగా తెలుస్తుంది.

ఈ 3 రోజుల్లో షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొని ప్రభాస్ పార్ట్ మొత్తాన్ని కంప్లీట్ చేయాలని చూస్తున్నారు.ఇక దాంతో పాటుగా ప్రభాస్ సంబంధించిన లుక్ ను కూడా తొందర్లోనే రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది.మరి మొన్నటి దాకా ప్రభాస్ ఈ సినిమాలో నటిస్తున్నాడా లేదా అంటూ పలువురు సందేహాన్ని వ్యక్తం చేసినప్పటికీ, ఇప్పటికైతే ప్రభాస్ ఈ సినిమాలో నటిస్తున్నాడు అంటూ భారీ ఎత్తున ప్రచారం అయితే సాగుతుంది.

మరి ఫస్ట్ లుక్ ని( First Look ) రిలీజ్ చేస్తే కానీ ప్రభాస్ ఈ సినిమాలో నటిస్తున్నాడా లేదా అనే విషయం మీద ఒక క్లారిటీ అయితే రాదు.

హమ్మయ్య! అల్లు అర్జున్ కి ఓ గండం గట్టెక్కింది... ఇక ఎంచక్కా అక్కడికి చెక్కేయొచ్చు!
Advertisement

తాజా వార్తలు