మన టాలీవుడ్ లో ఒక్క డ్యాన్స్ లో తప్ప అన్నీ క్రాఫ్ట్స్ లో మంచి పట్టు ఉన్న ఏకైక హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.( Pawan Kalyan ) ఆయన చేసే ప్రతీ సినిమాలో అన్నీ విభాగాల్లో తన మార్కు ఉండేలా చూసుకుంటాడు.
చాలామందికి పవన్ కళ్యాణ్ దర్సకత్వం వహించిన ఏకైక సినిమా ‘జానీ’ అని అనుకుంటూ ఉంటారు.కానీ తెలియని విషయం ఏమిటంటే ‘తమ్ముడు’ మరియు ‘ఖుషి’ సినిమాలకు కూడా దర్శకుడు పవన్ కల్యాణే.
ఈ విషయాన్నీ స్వయంగా ఆయన ప్రాణ స్నేహితుడు , ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.ఇక గుడుంబా శంకర్ కి పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్లే అందించిన సంగతి అందరికీ తెలిసిందే, ఈ చిత్రానికి వీర శంకర్ దర్శకత్వం వహించాడు.
కానీ కేవలం స్రీన్ నేమ్ మాత్రమే వీర శంకర్ , కానీ దర్శకత్వం వహించింది పవన్ కళ్యాణ్ మాత్రమే.

అంతే కాదు, ఈ సినిమాకి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఆ చిత్రానికి సంగీత దర్శకుడిగా పనిచేసిన మణిశర్మ ( Manisharma ) ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.నా సినిమాల్లో కెరీర్ బెస్ట్ ఆల్బం ఏదైనా ఉందా అంటే అది ‘గుడుంబా శంకర్’ ( Gudumba Shankar ) అనే చెప్తాను.ఒక సినిమాలో ఇన్ని రకాల జానర్స్ ని నేను ఇప్పటి వరకు వాడలేదు.
ఇదంతా పవన్ కళ్యాణ్ దగ్గరుండి నాతో చేయించుకున్నాడు, ఒక్కమాటలో చెప్పాలంటే ఈ సినిమాకి సంగీత దర్శకుడు పవన్ కళ్యాణ్ అని చెప్తా నేను, రాత్రి పగులు తేడా లేకుండా ఆయన నా రికార్డింగ్ రూమ్ లోనే ఉండేవాడు, ప్రతీ చిన్న డిటైలింగ్ ని అడిగి తెలుసుకొని తన ఇష్టానికి తగ్గట్టుగా మ్యూజిక్ ని కంపోజ్ చేయించుకున్నాడు.అందుకే ఈ సినిమాకి సంగీత దర్శకుడి క్రెడిట్స్ ఆయనకే ఇస్తాను అంటూ మణిశర్మ అప్పట్లో చేసిన కామెంట్స్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

అంతే కాదు పవన్ కళ్యాణ్ లో గొప్ప గాయకుడు ఉన్నాడనే విషయం కూడా అందరికీ తెలిసిందే.తమ్ముడు , ఖుషి, జానీ, అత్తారింటికి దారేది , అజ్ఞాతవాసి వంటి సినిమాల్లో ఆయన పాటలు పాడాడు.ఇప్పుడు పవన్ కళ్యాణ్ హీరో గా నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘హరి హర వీరమల్లు’ లో( Hari Hara Veeramallu ) కూడా ఒక పాట పాడబోతున్నాడని టాక్ వినిపిస్తుంది.దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తాను చేస్తున్న సినిమాలన్నీ పక్కన పెట్టి , ఈ నెల 14 వ తేదీ నుండి వారాహి యాత్ర చెయ్యబోతున్నాడు.మళ్ళీ జూన్ 26 వ తారీఖు నుండి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రెండవ షెడ్యూల్ లో పాల్గొనబోతున్నాడు.







