రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్( Former Minister KTR ) పిలుపునిచ్చారు.బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ సమావేశాన్ని నిర్వహించిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో( Assembly elections ) చాలా నియోజకవర్గాల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయామని కేటీఆర్ తెలిపారు.14 నియోజకవర్గాల్లో 4 నుంచి 5 వేల ఓట్ల తేడాతో ఓడిపోయామన్నారు.అయితే గ్రేటర్ హైదరాబాద్ లో అఖండ మెజార్టీతో విజయం సాధించామని పేర్కొన్నారు.ఈ క్రమంలోనే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని పిలుపునిచ్చారు.మోసం చేయడమే కాంగ్రెస్ నైజమన్న కేటీఆర్ 420 హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు.
తాజా వార్తలు