తమ్ముడు మంచివాడు అనుకుని చిరంజీవి విరాళం ఇచ్చారు.. పోసాని షాకింగ్ కామెంట్స్ వైరల్!

ఏపీ ఎన్నికల నేపథ్యంలో ప్రముఖ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళి( YCP Leader Posani Krishna Murali ) మళ్లీ యాక్టివ్ అయ్యారు.

చిరంజీవి పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కు జనసేన కోసం 5 కోట్ల రూపాయల విరాళం ఇవ్వగా ఆ విరాళం గురించి పోసాని సంచలన వ్యాఖ్యలు చేశారు.

తమ్ముడు మంచివాడు అనుకుని చిరంజీవి( Chiranjeevi ) విరాళం ఇచ్చారని పోసాని చెప్పుకొచ్చారు.చిరంజీవి విరాళం ఇచ్చే సమయానికి జనసేన( Janasena ) ఖాళీ అయిపోయిందని ఆయన కామెంట్లు చేశారు.

పవన్ కళ్యాణ్ గతంలో మహిళా వాలంటీర్ల( Women Volunteers ) గురించి నీచంగా కామెంట్లు చేశారని పోసాని పేర్కొన్నారు.పవన్ మానసిక రోగి అని ఆయన చెప్పుకొచ్చారు.

చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను ఎవరూ నమ్మరని 2014 సంవత్సరానికి ముందు 600 హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఆ హామీలను అమలు చేయలేదని పోసాని పేర్కొన్నారు.

Posani Krishna Murali Shocking Comments Goes Viral In Social Media Details Here,
Advertisement
Posani Krishna Murali Shocking Comments Goes Viral In Social Media Details Here,

జగన్ క్యారెక్టర్ చూసి జగన్( Jagan ) ను అభిమానిస్తున్నానని పోసాని తెలిపారు.చంద్రబాబు రోజుకో మాట మాట్లాడుతున్నారని ఏపీకి పురంధేశ్వరి లేడీ విలన్( Purandeswari Lady Villain ) లా తయారయ్యారని ఆయన కామెంట్లు చేశారు.పోసాని చంద్రబాబు, పవన్, పురంధేశ్వరిపై చేసిన విమర్శలు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి.

ఏపీ ఎఫ్డీసీ ఛైర్మన్ గా పని చేస్తున్న పోసాని మాటల తూటాలు బాగానే పేల్చారని కామెంట్లు వినిపిస్తున్నాయి.పోసాని కామెంట్లపై టీడీపీ, జనసేన నుంచి స్పందన వస్తుందేమో చూడాలి.

Posani Krishna Murali Shocking Comments Goes Viral In Social Media Details Here,

ఏపీ ఎన్నికలకు( AP Elections ) సరిగ్గా మరో 32 రోజుల సమయం మాత్రమే ఉండగా వరుస పర్యటనలతో రాజకీయ నేతలు ప్రజలకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు.వైసీపీ, టీడీపీ( YCP,TDP ) ప్రజల కోసం సరికొత్త హామీలను ప్రకటిస్తూ వాళ్లకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు.పోసాని చెప్పిన విషయాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

పోసాని కృష్ణమురళి ఎన్నికల్లో పోటీ చేయడానికి మాత్రం ఆసక్తి చూపడం లేదనే సంగతి తెలిసిందే.

పైసా ఖర్చు లేకుండా ఈ మ్యాజికల్ హోమ్ మేడ్ సీరం తో తెల్లగా మెరిసిపోండి!
Advertisement

తాజా వార్తలు