ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy ) ఇల్లు పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఎంతోమంది ఇల్లు లేనటువంటి మహిళలందరూ కూడా ఇల్లు పట్టాలు పొందారు అయితే ఇటీవల తెనాలిలో ఇల్లు పట్టాల రిజిస్ట్రేషన్ కి సంబంధించిన పత్రాలను అందజేయగా ఈ కార్యక్రమంలో గీతాంజలి( Geethanjali ) అనే ఓ మహిళ ఇల్లు పట్టాలి అందుకొని జగనన్నకు ఎంతో రుణపడి ఉంటానని ఆమె చాలా సంతోషం వ్యక్తం చేశారు.ఇప్పటివరకు తనకు సొంత ఇల్లు లేదని ఇప్పుడు నా సొంత ఇంటి కల నెరవేరింది అంటూ ఆమె ఎంతో సంబరపడ్డారు.

ఈ విధంగా గీతాంజలి తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ప్రతిపక్ష పార్టీలు ఈమెపై భారీ స్థాయిలో ట్రోల్స్ చేస్తూ మానసిక క్షోభకు గురి చేశారు.దీంతో ఈమె రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.అయితే ఈమెకు న్యాయం జరగాలని కేవలం ప్రతిపక్ష పార్టీ నేతలు, కార్యకర్తలు చేసినటువంటి ట్రోలింగ్ కారణంగానే ఈమె ఇలా ఆత్మహత్య చేసుకున్నది ఆమెకు న్యాయం జరగాలి అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో గీతాంజలికి మద్దతు తెలుపుతున్న సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే నటి పూనమ్ కౌర్( Poonam Kaur ) కూడా సోషల్ మీడియా వేదికగా ఈ విషయంపై స్పందిస్తూ చేసినటువంటి ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.గీతాంజలికి న్యాయం జరగాలి.అసలు ఆమె విషయంలో ఏం జరిగింది గీతాంజలి ఎందుకు సూసైడ్ చేసుకుంది? ఒక పార్టీకి చెందిన ఆన్లైన్ ట్రోల్స్ కారణంగానే ఆమె చనిపోయిందా? ఇలా అమ్మాయిల మీద లేనిపోని పుకార్లు పుట్టించి వారిని మానసికంగా వేధించడం వారికి బాగా అలవాటు అలాంటి వారిని శిక్షించాలి.గీతాంజలికి న్యాయం జరగాలి తన పిల్లలకు న్యాయం చేయండి అంటూ ఈమె చేసినటువంటి ట్వీట్ వైరల్ గా మారింది.