అర్జున్ కళ్యాణ్ పూజిత పొన్నాడ డేటింగ్ లో ఉన్నారా? ఆ హీరోయిన్ ఏం చెప్పిందంటే?

అర్జున్ కళ్యాణ్.ప్రస్తుతం తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 లో కంటెస్టెంట్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే.

 Poojitha Ponnada Reveals Relationship With Bigg Boss Fame Arjun Kalyan Details,-TeluguStop.com

అర్జున్ కళ్యాణ్ టాస్క్ లు , ఆట విషయంలో కంటె శ్రీ సత్య విషయంలోనే ఎక్కువ హైలెట్ గా నిలుస్తున్నాడు.శ్రీ సత్య వెనకే తిరుగుతూ, ఆమె అన్నయ్య అని పిలిచినా కూడా పట్టించుకోకుండా ఆమె వెనక తిరుగుతూ రెండు సార్లు జైలు కీ వెళ్ళినా కూడా మనోడికి బుద్ది మాత్రం రాలేదు.

అర్జున్ శ్రీ సత్య కోసం ఎంత ట్రై చేస్తున్నా కూడా శ్రీ సత్యం మాత్రం అతన్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టింది.

అంతేకాకుండా శ్రీ సత్య ఎంత చీదరించుకున్న కూడా ఆమె వెనకే తిరుగుతూ ఆమె కనిపిస్తే చాలు సొల్లు కార్చుకుంటున్నాడు.

హౌస్ అర్జున్ కళ్యాణ్ ని చూస్తుంటే హౌస్ లోకి టైటిల్ కోసం వచ్చాడా లేకపోతే శ్రీ సత్య కోసం వచ్చాడా అన్న విధంగా గేమ్ ఆడుతున్నాడు.కాక చాలామందికి తెలియని విషయం ఏమిటంటే అర్జున్ కళ్యాణ్ ప్రస్తుతం బిగ్బాస్ హౌస్లో శ్రీ సత్య వెనుక పడుతున్నాడు కానీ బిగ్ బాస్ హౌస్ కి రాకముందు పూజిత పొన్నాడ అనే ఆమెతో డేటింగ్ కూడా చేశాడు.

వీరిద్దరూ చాలా ఏళ్ల పాటు డేటింగ్ లో ఉండటమే కాకుండా పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అన్న వార్తలు కూడా వినిపించాయి.

ఇదే విషయాన్ని స్వయంగా అర్జున్ కళ్యాణ్ మాజీ ప్రేయసి అయిన పూజిత పొన్నాడ చెప్పుకొచ్చింది.ప్రస్తుతం నేను సింగల్ గానే ఉన్నాను.అర్జున్ కళ్యాణ్ తో కలిసి కొన్నాళ్లు డేటింగ్ లో ఉన్నాను.

మేమిద్దరం కలిసి చాలా ప్రాజెక్టులు చేశాం.డేటింగ్ చేసి ఆ తర్వాత విడిపోయాము.

అది జరిగి చాలా కాలం అయ్యింది.ఇద్దరు కలిసి విడిపోవాలి అనుకున్నాము అనుకున్న విధంగానే విడిపోయాము.

అర్జున్ నాకు ప్రపోజ్ చేశాడు ఆ తర్వాత ఓకే చేశాను.ప్రస్తుతం అర్జున్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాడు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను.

అలాగే మా మధ్య మంచి రిలేషన్ ఉంది.అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం.

మేము విడిపోయాం కానీ మా మధ్య రిలేషన్ మాత్రం పోలేదు అని చెప్పుకొచ్చింది పూజిత పొన్నాడ.

.

Poojitha Ponnada Love Story with Bigg Boss Arjun Kalyan

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube