సుకుమార్( Sukumar ) డైరెక్షన్ లో వచ్చిన రంగస్థలం సినిమాలో ఆది ప్రేమికురాలిగా నటించిన పూజిత( Pujita Ponnada ) ఆ సినిమాలో తను చేసిన చిన్న పాత్ర అయినా సరే మెప్పించింది.ఇక అమ్మడు ఆ తర్వాత సోలో హీరోయిన్ గా ప్రయత్నించిన వర్క్ అవుట్ అవలేదు.
అంతేకాదు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలతో సరిపెట్టుకుంటుంది.అయితే సినిమాలు చేతిలో లేకపోయినా అమ్మడు ఫోటో షూట్స్ తోనే సరిపెట్టుకుంటుంది.
ఆఫర్లు రావట్లేదో లేక తను కోరిన పాత్రలు చేయాలని అనుకుంటుందో కానీ పూజిత ఈమధ్య పూర్తిగా ఫోటో షూట్స్ కే పరిమితమైంది.
తన ఫోటో షూట్స్ తోనే కాలం వెళ్లదీస్తున్న అమ్మడు సోషల్ మీడియా( Social Media ) ఫాలోవర్స్ ని మాత్రం పెంచుకుంటుంది.
సినిమా ఛాన్స్ లు రాకపోయినా పూజిత మాత్రం ఎక్కడ నిరాశ చెందకుండా తన ఫోటో షూట్స్( Photoshoots ) తో అలరిస్తుంది.గ్లామర్ షోకి ఆమడదూరంలో ఉంటున్న అమ్మడు ఫోటో షూట్స్ లో కూడా వాటికి నో అనేస్తుంది.
కెరీర్ లో పెద్దగా అవకాశాలు లేని పూజిత మళ్లీ ఫాం లోకి వస్తుందా లేదా అన్నది చూడాలి.