లక్కీ ఛాన్స్ కొట్టేసిన పూజా హెగ్దే..!

వాణిజ్య ప్రకటనల నుండి సరాసరి హీరోయిన్స్ అయిన జాబితాలో పూజా హేగ్దే కూడా ఒకటి.

జీవా హీరోగా నటించిన మాస్క్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్దె తెలుగులో వరుణ్ తేజ్ తో ముకుంద, నాగ చైతన్యతో ఒక లైలా కోసం సినిమాల్లో నటించింది.

ఇక బాలీవుడ్ నుండి పిలుపు రాగానే పొలొమంటూ వెళ్లిన పూజా బీ టౌన్ క్రేజీ ప్రాజెక్ట్ మొహెంజదారొ సినిమాలో రాణిగా చేస్తుంది.రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా టైలర్ ప్రశంసలు అందుకుంది.

ఇక లక్ తోక తొక్కిన పూజా మరోసారి టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాతో ఎంట్రీ ఇస్తుంది.ప్రస్తుతం స్టార్ హీరోల్లో అల్లు అర్జున్ ఉన్న ఫాం ఎవరు లేరు.

ముచ్చటగా మూడు వరుస సినిమాలతో 50 కోట్ల షేర్ కలక్షన్స్ క్రాస్ చేసి కొత్త రికార్డ్ సృష్టించిన బన్ని సినిమాలో ఛాన్స్ అంటే ఈ అవకాశం కచ్చితంగా పూజా హెగ్దే కెరియర్ టర్నింగ్ అని చెప్పాలి.మరి వచ్చిన ఈ అవకాశాన్ని పూజా ఎలా ఉపయోగించుకోనుందో చూడాలి.

Advertisement

పక్కింటి అమ్మాయిలా సహజ నటనతో ఆకట్టుకుంటున్న పూజా హేగ్దే తీసిన రెండు సినిమాలతోనే తెలుగు ప్రేక్షకుల్లో క్రేజ్ సంపాదించింది.బన్ని, పూజాల క్రేజీ ప్రాజెక్ట్ ను హరీష్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్నారు.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు