Pooja Hegde : ఫస్ట్ టైం క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించిన పూజా హెగ్డే.. వాడిని చంపేయాలంటూ..!!

దువ్వాడ జగన్నాథం, అలవైకుంఠపురం,అరవింద సమేత వీర రాఘవ( Aravinda sametha veera raghava ) ,మహర్షి, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి సినిమాలతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో స్టార్ పొజిషన్ కి వెళ్ళింది నటి పూజా హెగ్డే.ఈమెకు ఈ సినిమాలతో తెలుగు, తమిళ భాషల్లో భారీగా ఆఫర్స్ వచ్చాయి.

 Pooja Hegde Reacts To The First Time Casting Couch-TeluguStop.com

అంతేకాదు బాలీవుడ్లో సైతం వరస ఆఫర్లు తన్నుకు రావడంతో ఈ హీరోయిన్ ఒక్కసారిగా సౌత్ నార్త్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది.కానీ మళ్లీ మొదట ఎలా అయితే ప్లాఫ్ హీరోయిన్ అనే పేరు తెచ్చుకుందో ప్రస్తుతం ఆమె పొజిషన్ కూడా అలానే ఉంది.అయితే అలాంటి హీరోయిన్ తాజాగా క్యాస్టింగ్ కౌచ్ ( Casting couch ) పై స్పందించింది.

పూజ హెగ్డే ( Pooja Hegdhe ) మాట్లాడుతూ.ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉంది.ఎంతోమంది అమ్మాయిలు హీరోయిన్స్ అవుదామని ఎన్నో ఆశలు పెట్టుకొని తల్లిదండ్రులు ఎంత వద్దన్నా వినకుండా హీరోయిన్స్ గా నిలదొక్కుకోవాలని వస్తూ ఉంటారు.

కానీ అలా వచ్చిన టైంలో చాలామంది దుర్మార్గులు క్యాస్టింగ్ కౌచ్ పేరుతో అమ్మాయిలను తమ కోరికలు తీర్చాలని టార్చర్ చేస్తూ ఉంటారు.ఇక ఇలాంటి దుర్మార్గులని క్షమించకుండా ఏదో ఒక రూపంలో కఠినంగా శిక్షించాలి.

కానీ ఇప్పటికైతే నా వరకు క్యాస్టింగ్ కౌచ్ అనేది రాలేదు.కానీ ఇండస్ట్రీకి వచ్చిన ఎంతో మంది నా స్నేహితులకు ఈ పరిస్థితి ఎదురైంది అంటూ మొదటిసారి పూజ హెగ్డే ( Pooja Hegde ) ఇండస్ట్రీలో ఉండే క్యాస్టింగ్ కౌచ్ పై నోరు విప్పింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube