పూజా హెగ్డే హీరోయిన్ టాలీవుడ్ లోనే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా మంచి గుర్తింపు దక్కించుకుని పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా దూసుకు పోతున్న విషయం తెల్సిందే.హీరోయిన్ గా వరుసగా సినిమా లు చేస్తూ దూసుకు పోతూ ప్రతి చోట గౌరవంను దక్కించుకుంటున్న పూజా హెగ్డే విమానంలో మాత్రం తన గౌరవం కు భంగం వాటిల్లింది అంటూ ఫిర్యాదు చేసింది.
ప్రముఖ విమానయాన సంస్థ లో ఇటీవల ప్రయాణించిన సమయంలో అక్కడి సిబ్బంది దురుసుగా ప్రవర్తించారంటూ ఆవేదన వ్యక్తం చేసింది.ఇలాంటి పరిస్థితి వస్తుందని తాను భావించలేదు.
ఇలాంటి విషయాలను తాను ట్విట్టర్ లో ప్రస్థావించాలి అనుకోను.కాని సదరు విమానయాన సంస్థ సిబ్బంది తీరు నాకు చాలా ఇబ్బంది కలిగించింది.
అందుకే నేను ఇలా ట్వీట్ చేయాల్సి వచ్చిందంటూ తనతో దురుసుగా ప్రవర్తించిన ఎయిర్ హోస్టెస్ పేరు ను కూడా ప్రస్థావించింది.హీరోయిన్ గా మీరు ఇండస్ట్రీలో ఎంత పెద్ద వారు అయ్యి ఉండవచ్చు.
విమానం ఎక్కిన సమయంలో అక్కడి వారికి అందరు సమానమే.మీరు ఇలాంటి విషయాలను అతి చేయాల్సిన అవసరం లేదు అంటూ కొందరు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.పూజా హెగ్డే మీలాంటి వారు ఇలాంటి విషయాల పట్ల ఇంతగా స్పందించాల్సిన పని లేదు.నేరుగా వారికి ఫిర్యాదు చేసినా సరిపోతుంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
మొత్తానికి విమానం లో లొల్లి విషయం పట్ల పూజా హెగ్డే అభిమానులు భిన్న స్వరం వినిపిస్తున్నారు.పెద్ద ఎత్తున పూజా హెగ్డే ప్రస్తుతం సినిమా లు చేస్తుంది.
ఇలాంటి సమయంలో చిల్లర వ్యవహారాలు అవసరమా అంటూ పూజా హెగ్డే ను కొందరు హెచ్చరిస్తున్నారు.మొత్తానికి పూజా హెగ్డే ట్విట్టర్ లో షేర్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
ఇటీవల ఈమె నటించిన రాధేశ్యామ్ సినిమా ప్లాప్ అయ్యింది.మరో వైపు ఆచార్య సినిమా కూడా ప్లాప్ అయ్యింది.







