గులాబీ రంగుతో పారుతున్న మడుగు.. అలా ఎలా జరిగిందంటారు ?

మడుగు చూడడానికి చాలా అందంగా ఉంది.చుస్తే చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది.

ఎందుకంటే ఆ మడుగు మాములు నీటితో కాకుండా గులాబీ రంగు వాటర్ తో నిండి పోయి ఉంది.చూస్తుంటే చాలా అందంగా కనిపిస్తుంది.

కానీ ఆ మడుగు పింక్ కలర్ లోకి ఎందుకు మారి పోయిందో తెలిస్తే మాత్రం మీరు దానిని అందంగా ఉందని పొగిడరు.అంతేకాదు దాని దగ్గరకు కూడా వెళ్లరు.

మాములుగా కొలను కానీ, నదులు కానీ కనిపిస్తే మనము వెంటనే ఆ నీటిలోకి దిగి ఈత కొడతాము.అయితే ఆ మడుగు మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంటుంది.

Advertisement

పింక్ కలర్ వాటర్ ఉండి చూడడానికి బాగుంది కదా అని ఆ నీటిలోకి దిగాలని అస్సలు ట్రై చేయకండి.ఎందుకంటే ఆ నీరు చాలా డేంజర్.

ఆ నీరు పింక్ కలర్ లోకి మారిపోవడానికి గల కారణం కనుక మీకు తెలిస్తే ఆశ్చర్య పోతారు.

దాని వెనుక ఇంత ఉందా అని అనుకుంటారు.ఈ మడుగు అర్జెంటీనా లోని పెటగొనియా ప్రాంతంలో ఉంది.ఈ మడుగు పింక్ కలర్ నీటి తో నిండి చూపరులను యిట్టె ఆకర్షిస్తుంది.

అయితే చూడడానికి అందంగా ఉన్న ఆ మడుగు హానికరమైన రసాయనాలతో నిండి ఉందని తెలుసా.స్థానికంగా ఉన్న చేపల ఫ్యాక్టరీ కారణంగా విడుదలయ్యే రసాయనాలు అక్కడ ఉన్న నదిలోకి లోకి వదులు తున్నారు.

ఆ యాంకర్లు బూతులు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో పాపులర్.. వింధ్య షాకింగ్ కామెంట్స్ వైరల్!
అమెరికన్ వర్సిటీలలో ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసనలు .. అన్నింటికీ బైడెనే కారణం : డొనాల్డ్ ట్రంప్

అందువల్ల ఆ నది పూర్తిగా కలుషితమై పింక్ కలర్ లోకి మారి పోయింది.ఆ నది నుండి చిన్న మడుగులకు కూడా నీరు చేరుతుంది.అందుకే ఈ మడుగు కూడా పింక్ కలర్ లోకి వచ్చింది.

Advertisement

ఇక్కడ నివసించే ప్రజలు ఈ కాలుష్యంపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన ప్రయోజనం లేకపోయింది.ఈ మడుగులోకి భారీ స్థాయిలో వ్యర్ధ పదార్దాలను వదులుతూ పర్యావరణాన్ని పడు చేస్తున్నారు.

మరి అక్కడి అధికారులు ఎప్పుడు ప్రజలు బాధలు పట్టించుకుంటారో.

తాజా వార్తలు